పాదాలూ చెబుతాయి..
ABN, Publish Date - Nov 13 , 2024 | 06:19 AM
మనకు ఉన్న ఆరోగ్య సమస్యలను మన పాదాలకు సంబంధించిన కొన్ని లక్షణాలు చెబుతాయి. వాటిని వెంటనే గమనించి చర్యలు తీసుకుంటే దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడవచ్చు.
మనకు ఉన్న ఆరోగ్య సమస్యలను మన పాదాలకు సంబంధించిన కొన్ని లక్షణాలు చెబుతాయి. వాటిని వెంటనే గమనించి చర్యలు తీసుకుంటే దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడవచ్చు.
గుండెకు లేదా కాలేయానికి సంబంధించిన సంబంధించిన సమస్యలు కావచ్చు. మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయటంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాలేయ సమస్యలు ఉన్నప్పుడు కాళ్లు వాస్తాయి. అదే విధంగా కాళ్లకు రక్తప్రసారం సరిగ్గా జరగకపోయినా కాళ్లు వాస్తాయి.
మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ల విలువల్లో తేడాలు వచ్చినప్పుడు కాళ్లు వాచే అవకాశముంది. రసజ్వల అయినప్పుడు.. గర్భవతి అయినప్పుడు.. రుతుస్రావం ఆగిపోయే సమయంలోను కాళ్ల వాపులు కనిపిస్తాయి. ఈ వాపు ముఖ్యంగా పాదాల దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది.
కొందరికి మడమల పైభాగంలో వాపు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువ కాలం తగ్గకపోతే యూరిక్ యాసిడ్ ఎక్కువ అయినట్లుగా భావించవచ్చు.
కొందరి కాళ్లను జాగ్రత్తగా చూస్తే చిన్న చిన్న నరాలు పైకి ఉబికి ఉంటాయి. వీటిని వైద్య పరిభాషలో ‘స్పైడర్ వీన్స్’ అంటారు. కాళ్లలోకి రక్తప్రసారం సరిగ్గా లేకపోతే ఇవి ఏర్పడతాయి.
కొందరికి ప్రతి రోజూ కాళ్ల తిమ్మిరిలు వస్తూ ఉంటాయి. మధుమేహం సమస్య ఉన్నవారికి ఈ సంకేతాలు కనిపించిన వెంటనే వైద్యులకు చూపించుకోవటం మంచిది.
Updated Date - Nov 13 , 2024 | 06:19 AM