ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : చలికాలంలో వేడిగా తాగండి!

ABN, Publish Date - Nov 20 , 2024 | 05:27 AM

చలికాలంలో సహజంగానే బద్ధకంగా, నీరసంగా అనిపిస్తుంటుంది. వాతావరణం చల్లగా ఉండడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి రోగనిరోధక శక్తి బలహీనమవుతుంది.

లికాలంలో సహజంగానే బద్ధకంగా, నీరసంగా అనిపిస్తుంటుంది. వాతావరణం చల్లగా ఉండడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి రోగనిరోధక శక్తి బలహీనమవుతుంది. తరచూ జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు వేధిస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొంది రోజంతా ఉత్సాహంగా పనిచేయడానికి ఉదయాన్నే వేడిగా కొన్ని పానీయాలు తాగడం మంచిదని అంటున్నారు నిపుణులు. వాటి గురించి తెలుసుకుందాం!

అల్లం-నిమ్మకాయ టీ

ఫ అల్లం, నిమ్మకాయ రెండూ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గొంతు గరగరను నివారిస్తాయి. నిమ్మకాయలోని సి-విటమిన్‌ వ్యాధులను వ్యాప్తిచేసే బ్యాక్టీరియా, వైర్‌సలతో పోరాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒక గిన్నెలో రెండు చిన్న అల్లం ముక్కలు వేసి, అందులో ఒక గ్లాసు మంచినీళ్లు పోసి బాగా మరిగించాలి. తరవాత ఈ నీళ్లను వడబోసి అందులో రెండు చెంచాల నిమ్మరసం కలిపి వేడిగా తాగాలి.

పసుపు పాలు

ఫ పసుపులోని కర్కుమిన్‌ గుండె జబ్బుల నివారణకు, నరాలు పటిష్టంగా ఉండేందుకు తోడ్పడుతుంది. చలికాలంలో కీళ్లు పట్టేయకుండా కాపాడుతుంది. పాలలోని కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ఒక గ్లాసు వేడి పాలలో ఒక చెంచా పసుపు, చిటికెడు నల్ల మిరియాల పొడి, ఒక చెంచా తేనె కలిపి తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. ఈ కషాయంలో మిరియాల పొడిని కలపడం వల్ల పసుపులోని కర్కుమిన్‌ పూర్తిస్థాయిలో శరీరానికి అందుతుంది.

దాల్చిన చెక్క పానీయం

ఫ దాల్చిన చెక్క జీవక్రియలను వేగవంతం చేసి శరీరాన్ని ఉత్సాహపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఒక గ్లాసు వేడినీటిలో అర చెంచా దాల్చిన చెక్క పొడి, ఒక చెంచా తేనె వేసి బాగా కలిపి వేడిగా ఉన్నప్పుడే తాగాలి.

నిమ్మకాయ-తేనె

ఫ నిమ్మరసం, తేనెల మిశ్రమం శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపుతుంది. జీర్ణాశయం, కాలేయం సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. ఒక గ్లాసు వేడి నీళ్లలో మూడు చెంచాల నిమ్మరసం, రెండు చెంచాల తేనె కలిపి వేడిగా తాగితే చలికాలంలో వచ్చే శ్వాసకోశ సమస్యలనుంచి ఉపశమనం కలుగుతుంది.

తులసి-పుదీనా

తులసి ఆకులు ఒత్తిడిని తగ్గిస్తాయి. పుదీనా పొట్టను శుభ్రం చేస్తుంది. ఒక గ్లాసు వేడినీటిలో అయిదు తులసి ఆకులు, ఎనిమిది పుదీనా ఆకులు వేసి కొంతసేపు నాననివ్వాలి. గోరువెచ్చని ఈ పానీయం తాగుతున్నపుడు వచ్చే సువాసన వల్ల మనసుకు ఉత్సాహం కలిగి శరీరానికి బద్ధకం వదులుతుంది.

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌-తేనె

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ శరీరంలో పీహెచ్‌ స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. ఒక గ్లాసు వేడినీటిలో ఒక చెంచా యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, ఒక చెంచా తేనె కలపాలి. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ పానీయం తాగిన వెంటనే కడుపులో తేలికగా ఉన్న భావన కలుగుతుంది. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

కశ్మీరీ కహ్వా

ఒక గిన్నెలో రెండు గ్లాసుల మంచి నీళ్లు, రెండు యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక చెంచా గ్రీన్‌ టీ ఆకుల పొడి, రెండు చెంచాల ఎండు గులాబీ రేకులు వేసి బాగా మరిగించాలి. తరవాత ఈ నీళ్లను వడబోసి అందులో ఒక చెంచా తేనె, కొన్ని బాదం పలుకులు, కుంకుమ పువ్వు రేకులు వేసి బాగా కలపాలి. ఈ పానీయాన్ని పొద్దున్నే వేడిగా తాగితే జలుబు, ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలుగుతుంది. దీని ఘాటైన పరిమళం అలసటను, ఒత్తిడిని తగ్గిస్తుంది.

Updated Date - Nov 20 , 2024 | 05:27 AM