చలిలో చమక్కుమనేలా...
ABN, Publish Date - Nov 09 , 2024 | 06:45 AM
పొడిచర్మం కలిగినవాళ్లకు చలికాలం ఇక్కట్లు తప్పవు. ఈ కాలంలో చర్మం చిట్లి, పొట్టు రేగే గుణం కలిగినవాళ్లు మేకప్ వేసుకునేటప్పుడు కొన్ని మెలకువలు పాటించాలి. అవేంటంటే...
పొడిచర్మం కలిగినవాళ్లకు చలికాలం ఇక్కట్లు తప్పవు. ఈ కాలంలో చర్మం చిట్లి, పొట్టు రేగే గుణం కలిగినవాళ్లు మేకప్ వేసుకునేటప్పుడు కొన్ని మెలకువలు పాటించాలి. అవేంటంటే...
ఫేస్‌వాష్: చర్మంలో మిగిలి ఉన్న తేమను వదిలించే సబ్బులకు బదులుగా విటమిన్‌సిని కలిగి ఉండే ఫేస్‌వాష్ ఎంచుకోవాలి. దీంతో చర్మంలోని మలినాలు తొలగడంతో పాటు చర్మపు తేమ భద్రంగా ఉంటుంది. ఫేస్‌వాష్‌తో ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత, అదనపు తేమ కోసం హైడ్రేటింగ్ సీరమ్‌ను పూసుకోవాలి. తర్వాత ప్రైమర్‌ను ముఖానికి అద్దుకుని, ఆ తర్వాతే మేకప్ వేసుకోవడం మొదలుపెట్టాలి.
ఫౌండేషన్: తేమను కలిగి ఉండే ఫౌండేషన్‌ను ఎంచుకుంటే, ముఖం మరింత పొడిబారకుండా ఉంటుంది. అలాగే దీన్ని ముఖానికి పూసుకోవడం కోసం తడిపి పిండిన స్పాంజి వాడుకోవాలి. ఫౌండేషన్‌లో కొద్దిగా ఫేసియాల్ నూనెను కలిపి ముఖం మీద సమంగా అద్దుకోవాలి.
ఉత్పత్తులు: ఈ కాలంలో పౌడర్ ఆధారిత ఉత్పత్తులకు బదులుగా క్రీమ్ ఆధారిత ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవైతే చర్మంలో చక్కగా ఇంకిపోయి, చక్కని మెరుపునూ, మృదుత్వాన్నీ ఇస్తాయి.
ఐ మేకప్: కళ్ల చుట్టూ ముడతలు, వలయాలను కనిపించకుండా చేయడం కోసం, వీలైనంత తక్కువ ఫౌండేషన్ అద్దుకోవాలి. దీన్లో కాస్త ముదురు రంగు బ్లష్‌ను కలిపి కనురెప్పల దిగువన అద్దుకుంటే కళ్ల కింద నలుపు చర్మంలో కలిసిపోతుంది. కనురెప్పల పైన వేసుకునే ఐషాడో కూడా లేత రంగులో క్రీమ్ ఆధారితమైనదై ఉండేలా చూసుకోవాలి.
లిప్‌స్టిక్: లిప్‌స్టిక్ వేసుకునే ముందు పెదవుల మీద మృత కణాలను తొలగించి, తేమ కోసం అదనపు ఉత్పత్తులు వాడుకోవాలి. ఇలా పెదవులను మృదువుగా మార్చుకున్న తర్వాత లిప్‌స్టిక్ వేసుకుంటే, పెదవులు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. పెదవుల పగుళ్లు కూడా దూరమవుతాయి.
Updated Date - Nov 09 , 2024 | 06:45 AM