ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఈద్‌... ఆధ్యాత్మిక ఆరాధన

ABN, Publish Date - Apr 05 , 2024 | 08:58 AM

ఈద్‌ (పండుగ) అంటే కరుణామయుడైన అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలియజేయడం. ఆయన ప్రసాదించిన వరాలను గుర్తించడం. ప్రభువు కరుణానుగ్రహాలను తలచుకోవడం, విశ్వాసాన్ని స్థిరపరుచుకోవడం, ధర్మాన్ని బలపరచడం.

ఈద్‌ (పండుగ) అంటే కరుణామయుడైన అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలియజేయడం. ఆయన ప్రసాదించిన వరాలను గుర్తించడం. ప్రభువు కరుణానుగ్రహాలను తలచుకోవడం, విశ్వాసాన్ని స్థిరపరుచుకోవడం, ధర్మాన్ని బలపరచడం. ఉపవాసాలలో జరిగిన పొరపాట్లకు బదులుగా... పండుగ రోజున నిరుపేదలకు జకాతుల్‌ ఫిత్రా దానం ఖచ్చితంగా చెల్లించి, పేదల్లో సంతాషాన్ని నింపడం విశ్వాసుల కర్తవ్యం. ఈద్‌ అనేది అల్లాహ్‌ తరఫున బహుమతులను అందుకొనే రోజు. నెల రోజులు సాగే ఈద్‌ ఉపవాస దీక్ష... పవిత్రమైన రంజాన్‌ నెలవంక కనిపించిన తరువాత ప్రారంభమవుతుంది. ఆ మాసం ముగిశాక... షవ్వాల్‌ నెలవంక దర్శనమిచ్చిన తరువాత చేసే నమాజ్‌తో ముగుస్తుంది. పరిపూర్ణమైన నమ్మకంతో, పుణ్యఫలాన్ని ఆశించి ఉపవాసాలు పాటించేవారికి... ఈ పండుగ ఒక గొప్ప బహుమానం. దీనికి భిన్నంగా ఉపవాస సమయంలో పాపాలు చేసి, అల్లాహ్‌ నిర్దేశించిన నియమాలను అతిక్రమించి, ఆయన ఆజ్ఞలను నిర్లక్ష్యం చేసిన వారు తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం చెందాల్సిన రోజు కూడా ఇదే.

ఈదుల్‌ ఫిత్ర్‌ (రంజాన్‌) పర్వదినాన చేయవలసిన పనులను పెద్దలు ప్రత్యేకంగా నిర్దేశించారు. అవి: పొద్దున్నే నిద్రలేవాలి. కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఫజ్ర్‌ నమాజ్‌ కచ్చితంగా చదవాలి. తలంటు స్నానం చేయాలి. ఉన్నవాటిలో మంచి దుస్తులను ధరించాలి. అత్తరులాంటి సుగంధాలు పూసుకోవాలి. కళ్ళలో సుర్మా పెట్టుకోవాలి. ఈద్‌ నమాజ్‌కు ముందే జకాత్‌, ఫిత్రా చెల్లించాలి. తీపి పదార్థాన్ని స్వీకరించాలి. ఒకటి, మూడు, అయిదు, ఏడు... ఇలా బేసి సంఖ్యలో ఖర్జూర పండ్లను తినాలి. ఈద్గా మైదానానికి ఒక మార్గంలో వెళ్ళి, వేరే మార్గంలో తిరిగి రావాలి. నమాజ్‌కు వెళ్తున్నప్పుడు తక్బీర్‌ను మెల్లగా చదువుతూ ముందుకు సాగాలి. కాలి నడకన వెళ్ళడం వల్ల మరింత పుణ్యం లభిస్తుంది. పండుగ నమాజ్‌ తరువాత పరస్పరం సలామ్‌ చెప్పుకోవాలి. పిల్లలకు ‘ఈదీ’ (బహుమతులు) ఇవ్వాలి. బంధువుల ఇళ్ళకు వెళ్ళి, వారికి శుభాకాంక్షలు తెలపాలి. ఇరుగుపొరుగువారికి తీపి పదార్థాలను ఇవ్వాలి. సాహిల్‌ (అడిగేవారు, అర్థించేవారు) ఇంటికి వస్తే... కచ్చితంగా దానం ఇచ్చి పంపాలి. అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుకొంటూ... సంతోషంగా గడపాలి. పండుగ నమాజ్‌ను ఇరుకైన జనావాసాలలో కాకుండా... విశాలమైన బహిరంగ ప్రదేశాలలో (ఈద్‌గాహ్‌) వద్ద నిర్వహించడం ఉత్తమం. దైవ ప్రవక్త మహమ్మద్‌ సంప్రదాయం కూడా అదే. దగ్గరలో ఈద్‌గాహ్‌ లేనపుఁడు... స్థానికంగా ఉండే పెద్ద మసీదుల్లో ఈద్‌ నమాజ్‌ చేయాలి. ఈద్‌... ఒక ఆధ్యాత్మిక ఆరాధన. చిత్తశుద్ధితో ఆచరించే ఆ ఆరాధన అల్లాహ్‌ కటాక్షాన్ని, సర్వ శుభాలను కలుగజేస్తుంది.

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - Apr 05 , 2024 | 08:58 AM

Advertising
Advertising