ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mr. Bachchan : బాధను ఓర్చుకుంటూ షూటింగ్‌లో...

ABN, Publish Date - Jun 16 , 2024 | 05:19 AM

రవితేజ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఇండస్ట్రీలో అనేక కష్టాలు పడి పైకొచ్చిన వ్యక్తిగా రవితేజకు మంచి పేరుంది.

రవితేజ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఇండస్ట్రీలో అనేక కష్టాలు పడి పైకొచ్చిన వ్యక్తిగా రవితేజకు మంచి పేరుంది. పనిపట్ల రవితేజకు ఉన్న అంకిత భావాన్ని ప్రశంసిస్తూ హరీశ్‌ శంకర్‌ ‘మిస్టర్‌ బచ్చన్‌’ షూటింగ్‌లో తీసిన కొన్ని ఫొటోలను షేర్‌ చేశారు. ఓ ఫొటోలో రవితేజ తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతుండగా, నొప్పి తగ్గడానికి రవితేజ మెడపై బ్యాండ్‌ పెట్టి పట్టుకున్నారు హరీశ్‌ శంకర్‌. ఆ ఫొటోపై హరీశ్‌ శంకర్‌ స్పందిస్తూ ‘థాంక్యూ అన్నయ్యా, ప్రతి రోజూ నీ కష్టంతో మాలో స్ఫూర్తిని నింపుతున్నావు. తీవ్రమైన మెడనొప్పి ఇబ్బందిపెడుతున్నా ఆ బాధను ఓర్చుకుంటూ షూటింగ్‌లో పాల్గొంటున్నావు. మాస్‌ మహారాజా డెడికేషన్‌కు హ్యాట్సాఫ్‌’ అని హరీశ్‌ శంకర్‌ పేర్కొన్నారు. హరీశ్‌ శంకర్‌, రవితేజ కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈనెల 17న మేకర్స్‌ టీజర్‌ను విడుదల చేయనున్నారు.

Updated Date - Jun 16 , 2024 | 05:19 AM

Advertising
Advertising