Fashion : ఈ అతిశయం పువ్వులదే!
ABN, Publish Date - Sep 11 , 2024 | 04:11 AM
పూలు, లతలు ఎక్కడున్నా అందరి కళ్లూ అటు వైపే మళ్లిపోతాయి. కాబట్టే పూలు, లతల ఫ్యాషన్ ట్రెండ్ ‘ఫోలియేజ్’ యువతులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ కోవకు చెందిన ఫోలియేజ్ డ్రెసెస్ మీద ఓ లుక్కేద్దామా..
ఫ్యాషన్
పూలు, లతలు ఎక్కడున్నా అందరి కళ్లూ అటు వైపే మళ్లిపోతాయి. కాబట్టే పూలు, లతల ఫ్యాషన్ ట్రెండ్ ‘ఫోలియేజ్’ యువతులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ కోవకు చెందిన ఫోలియేజ్ డ్రెసెస్ మీద ఓ లుక్కేద్దామా..
పువ్వులు, లతలు, కొమ్మలు... ఫోలియేజ్ డ్రస్సులో తప్పనిసరిగా కనిపించే అంశాలివి. ప్రకృతిని మరిపించే ఈ అంశాల్లో ప్రత్యేతల ఆధారంగా వినూత్నమైన మోడర్న్ డ్రస్‌లు తయారవుతూ ఉంటాయి. గాల్లో తేలుతున్నట్టుండే మెటీరియల్స్‌తో, సౌకర్యం, ఆధునికతలే తొలి ప్రాథాన్యంగా తయారయ్యే ఈ దుస్తులు వేర్వేరు సందర్భాలకు అనువుగా ఉంటాయి. ఫోలియేజ్ దుస్తులు, వైవిద్యాన్ని కనబరచడం కోసం భిన్నమైన డిజైన్లలో కూడా తయారవుతూ ఉంటాయి.
ఆటమ్ ఫోలియేజ్
ఈ డ్రస్ సుతిమెత్తని ఫ్లోయీ మెటీరియల్‌తో తయారవుతుంది. కదిలేటప్పుడు, చెట్ల ఆకులు రాలి నేల మీద పడుతున్న శబ్దం వెలువడుతుంది. ఈవినింగ్ పార్టీలు, వేడుకల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా కనిపించడం కోసం ఈ డ్రస్‌ను ఎంచుకోవచ్చు. హూందాగా, ఫ్యాషన్‌గా కనిపించేలా చేసే ఆటమ్ ఫోలియేజ్ ఫాల్ డ్రస్‌ను తేలికపాటి ప్లాటినం లేదా యాంటిక్ జ్యువెలరీ, హైహీల్స్‌తో మ్యాచ్ చేయాలి.
ఫోలియేజ్ లినెన్
బోహో స్టైల్లో అదరగొట్టాలంటే లినెన్ మెటీరియల్ ఫోలియేజ్ డ్రస్ ఎంచుకోవాలి. కాలర్ జోడిస్తే, ఈ డ్రస్‌కు మోడర్న్ లుక్ సమకూరుతుంది. అలాగే బెల్ట్ కూడా! పెద్ద బకిల్ ఉండే బెల్టులు ఈ దుస్తుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. యాంకిల్ బూట్స్ అదనపు ఆకర్షణను తెచ్చి పెడతాయి.
కౌటౌ ఫోలియేజ్ డ్రస్
ఆర్గానిక్ కాటన్ జెర్సీతో రూపొందే ఈ డ్రస్సులో చెట్ల పందిరి వైపు చూస్తున్నట్టుండే డిజైన్లు కనిపిస్తాయి. చిక్కని ఆకులు, లతలు, కొమ్మలు ఈ డిజైన్‌లో స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ప్రకృతిని మరిపించే ఈ డిజైన్ మొత్తంగా ఆకుపచ్చ రంగులోనే ఉంటుందనుకుంటే పొరపాటు. డిజైన్లు ప్రకృతిని మరిపించినా రంగుల్లో వైవిద్యం కనబడుతుంది.
Updated Date - Sep 11 , 2024 | 04:11 AM