ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Festival Kitchen : వంకాయ కొబ్బరి పులావ్‌

ABN, Publish Date - Sep 07 , 2024 | 12:34 AM

పండగ వచ్చిందంటే అందరూ కొత్త రుచులు కోరుకుంటారు. అలాంటి మూడు వంటలను మీకు అందిస్తున్నాం.. ఆస్వాదించండి..

వంటిల్లు

  • పండగ రుచులు

పండగ వచ్చిందంటే అందరూ కొత్త రుచులు కోరుకుంటారు. అలాంటి మూడు వంటలను మీకు అందిస్తున్నాం.. ఆస్వాదించండి..

  • కావాల్సిన పదార్థాలు:

తరిగిన వంకాయ ముక్కలు (200గ్రాములు), బిర్యానీ బియ్యం (200 గ్రాములు) తరిగిన ఉల్లిపాయ ముక్కలు (200గ్రాములు), తరిగిన పచ్చిమిర్చి (50గ్రాములు), నూనె (తగినంత), నెయ్యి(తగినంత), అల్లం పేస్ట్‌ (రెండు టీస్పూన్లు), కరివేపాకు (రెండు రబ్బలు), లవంగాలు (50 గ్రాములు), ఏలక్కాయలు (50గ్రాములు), దాల్చిన చెక్క (ఒక ఇంచు), బిర్యానీ ఆకు (5గ్రాములు), తరిగిన కొత్తిమీర (50 గ్రాములు), పుదీనా (50గ్రాములు), కొబ్బరి తురుము (ఒక కప్పు), తరిగిన క్యారెట్‌ (100గ్రాములు), తరిగిన బీన్స్‌ (100గ్రాములు), తరిగిన బంగాళదుంప ముక్కలు (100గ్రాములు), ఉప్పు (తగినంత), నీళ్లు (తగినన్ని)

  • తయారీ విధానం:

ఒక మూకుడులోకి నూనె తీసుకొని వేడి చేయాలి. దీనిలో లవంగాలు, ఏలక్కాయలు, దాల్చిన చెక్క దోరగా వేయించాలి. ఇలా వేగిన మిశ్రమంలో ఉల్లిపాయలు, అల్లంపేస్ట్‌, వంకాయ ముక్కలను వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన మిశ్రమంలో నీళ్లు పోయాలి. దీనిలో కడిగిన బియ్యం, క్యారెట్‌, బీన్స్‌, బంగాళదుంపలు, బిర్యానీ ఆకు, నెయ్యి వేసి ఉడకనివ్వాలి. బియ్యం బాగా ఉడికిన తర్వాత దానిలో కొత్తిమీర, పుదీనా, కొబ్బరి తురుము, ఉప్పు, కరివేపాకు వేసి కొద్ది సేపు మంట మీద మగ్గనివ్వాలి.

  • జాగ్రత్తలు

  1. పులావు పొడిపొడిగా ఉంటేనే బావుంటుంది. అందువల్ల బియ్యం ముద్దగా కాకుండా చూసుకోవాలి.

  2. బిర్యానీ కోసం లేత వంకాయల్ని ఎంపిక చేసుకుంటే మంచిది. వంకాయ ముక్కలను ఎక్కువగా వేగనియ్యకూడదు.

Updated Date - Sep 07 , 2024 | 12:34 AM

Advertising
Advertising