Festive Cuisine : ఉగ్గాని వడలు
ABN, Publish Date - Sep 07 , 2024 | 12:44 AM
మరమరాలు (100 గ్రాములు), తరిగిన అల్లం ముక్కలు (రుచికి సరిపోయినట్లుగా), తరిగిన కొత్తిమీర (మూడు టీస్పూన్లు), సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు (రెండు టీస్పూన్లు),
కావాల్సిన పదార్థాలు :
మరమరాలు (100 గ్రాములు), తరిగిన అల్లం ముక్కలు (రుచికి సరిపోయినట్లుగా), తరిగిన కొత్తిమీర (మూడు టీస్పూన్లు), సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు (రెండు టీస్పూన్లు), తరిగిన పుదీనా (ఒక టీస్పూను), శనగపిండి (తగినంత), వాము,(అర టీస్పూను) జీలకర్ర (ఒక టీస్పూను), పసుపు (అర టీస్పూను), నూనె (తగినంత), ఉప్పు (తగినంత)
తయారీ విధానం:
మరమరాలును 10 నిమిషాలు నీటిలో నానబెట్టి బయటకు తీసి ఒక బేసిన్‌లో వేయాలి. ఈ బేసిన్‌లోనే అల్లం ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, శనగపిండి, వాము, జీలకర్ర, పసుపు, ఉప్పు వేసి ముద్దగా చేసుకోవాలి. ఈ ముద్దను ఉండలుగా చేసి- వడలు మాదిరిగా చేతితో వత్తాలి. ఆ తర్వాత వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
జాగ్రత్తలు
ఈ వడలను బాగా వేడి నూనెలో వేయించకూడదు. అలా వేయిస్తే మాడిపోయ అవకాశముంది. దోరగా వేయిస్తే తినటానికి చాలా బావుంటాయి.
Updated Date - Sep 07 , 2024 | 12:44 AM