Fitness Level : ఈ వ్యాయామంతో శరీరం దృఢం
ABN, Publish Date - Sep 24 , 2024 | 04:33 AM
స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌లో డెడ్ లిఫ్ట్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. దృఢమైన శరీరాకృతి కోసం ప్రతి రోజూ డెడ్ లిఫ్ట్ సాధన చేయడం అవసరం. అయితే ఈ వ్యాయామం, వయసు, దారుఢ్యం, ఆరోగ్యం... ఈ మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
ఫిట్‌నెస్
స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌లో డెడ్ లిఫ్ట్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. దృఢమైన శరీరాకృతి కోసం ప్రతి రోజూ డెడ్ లిఫ్ట్ సాధన చేయడం అవసరం. అయితే ఈ వ్యాయామం, వయసు, దారుఢ్యం, ఆరోగ్యం... ఈ మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
సాధారణంగా డెడ్ లిఫ్ట్... బాడీ పోశ్చర్, ఎముకల సాంద్రతలను పెంచుతుంది. అయితే ఫిట్‌నెస్ లెవెల్, ఫామ్, తీవ్రత, రికవరీ మొదలైన భిన్నమైన అంశాల మీదే ఈ వ్యాయామం ప్రతికూల, అనుకూల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. డెడ్ లిఫ్ట్స్‌ను ప్రతి రోజూ సాధన చేస్తే..
దారుఢ్యం: పిరుదుల కండరాలు, పిక్కల్లోని కండరాలు, వెన్ను, కోర్ కండరాలను ఈ వ్యాయామం బలపరుస్తుంది. ఈ వ్యాయామంతో ఈ కండర సమూహాలు దృఢపడి, కండరాల బరువు, పరిమాణాలు పెరుగుతాయి.
పోశ్చర్: సరైన పోశ్చర్‌కు తోడ్పడే కండరాలు ఈ వ్యాయామంతో బలపడతాయి. వెన్ను నిటారు గా మారుతుంది. కాబట్టి పట్టు తప్పి పడిపోవడం, తూలిపడడం లాంటి ప్రమాదాలు తప్పుతాయి.
ఎముకల సాంద్రత: ఈ వ్యాయామంతో ఎముకల ఎదుగుదల, సాంద్రత పెరుగుతుంది. దాంతో ఆస్టియొపొరోసిస్ తగ్గి, పెద్ద వయసులో ఎముకలు విరిగే ప్రమాదాలు తగ్గుతాయి.
పట్టు: చేతుల్లో పట్టు పెరుగుతుంది. దాంతో దైనందిన జీవితంలో చేతుల్లో నుంచి వస్తువులు జారి పడిపోవడం, చేతులు పట్టుతప్పడం లాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండదు.
అతి శిక్షణ: ఇది తీవ్రమైన వ్యాయామం. కేంద్ర నాడీ వ్యవస్థ, మస్క్యులో స్కెలెటల్ వ్యవస్థల మీద ఒత్తిడి పెంచే వ్యాయామమిది. ప్రతి రోజూ ఈ వ్యాయామం చేసేవారు, తగినంత విశ్రాంతి కూడా తీసుకుంటూ ఉండాలి. లేదంటే అలసట పెరిగి, ప్రమాదాలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.
కీళ్ల ఒత్తిడి: డెడ్ లిఫ్ట్స్‌తో వెన్ను, పిరుదులు, మోకాళ్ల మీద ఒత్తిడి పడుతుంది. ఊబకాయులు, కీళ్ల సమస్యలు ఉన్నవాళ్లు ఈ వ్యాయామానికి దూరంగా ఉండాలి.
Updated Date - Sep 24 , 2024 | 04:33 AM