Healthy Fruits : కాలంతో సంబంధం లేకుండా మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచే ఐదు రకాల పండ్లు..
ABN, Publish Date - Jun 29 , 2024 | 11:43 AM
కొన్ని రకాల పండ్లు కాలంతో పనిలేకుండా మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో పనిచేస్తాయి.
శరీరం పరిమాణం, లింగం, చెమట పట్టే విధానం, శరీరక శ్రమ వీటితో సంబంధం లేకుండా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకునేందుకు సహకరించాలి. మూత్రం లేత పసుపు రంగులో ఉన్నా, రంగు మారి ఉన్నా కూడా నిర్జలీకరణాలినికి గురవుతారు. స్పష్టంగా ఉన్నట్లయితే ఎక్కువ నీరు తాగాలి. ఉపశమనం పొందాలి. దీనికి పండ్లు తీసుకోవాలి. కొన్ని రకాల పండ్లు కాలంతో పనిలేకుండా మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో పనిచేస్తాయి.
పండ్లను తీసుకోవడం కడుపు నింపేసుకోవడానికి కాదు.. లేదా వారంలో ఏదో ఒకరోజు తీసుకుంటే ఆరోగ్యం వచ్చేయదు. ఏ కాలం అని కాకుండా శరీరం నిత్యం హైడ్రేట్‌గా ఉండటం చాలా అవసరం. ఇందుకోసం నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తినడం కూడా అంతే అవసరం. దీనికోసం కొన్ని రకాల పండ్లను ఎంచుకుంటే..
కర్బూజా..
ఈ జ్యూసీ పండు సరిగ్గా వేసవిలో వస్తుంది. సరిగ్గా వేడి వాతావరణంలో ఉండగా కర్బూజా పండు శరీరాన్ని చల్లగా మార్చేస్తుంది. ఇందులో 89 శాతం నీరు ఉంటుంది. విటమిన్ ఎ, సిలతో నిండి ఉండే ఈ పండు వేసవిలో మంచి జ్యూసీ పండుగా పేరు పొందింది.
Coffee For Skin : చర్మం నిగారింపును పెంచే కాఫీ.. దీనితో ముఖానికి అందాన్ని పెంచండిలా..!
కమలా..
కమలా పండ్లు విటమిన్ సితో నిండి ఉంటాయి. ఇవి సిట్రస్ పండ్ల జాతికి చెందినవి. అంతేకాకుండా వేసవి కాలానికి పసందైన విందు ఈ పండ్లు. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ముందుంటాయి. ఈ జ్యూస్ ఒక గ్లాసు తాగితే చాలు చాలా శక్తి శరీరంలోకి వచ్చి చేరినట్టుగా ఉంటుంది.
స్ట్రాబెర్రీలు..
బెర్రీస్ ఎర్రగా చూడగానే ఆకర్షించే విధంగా ఉంటాయి. పుల్లగా, కాస్త తీయగా ఉండే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు కూడా ఎక్కువగా ఉంటాయి.
కీరదోశ..
బరువు తగ్గాలనుకునే వారు ముఖ్యంగా తీసుకునే పండ్లలో దోసకాయ కూడా ఒకటి.
Women Health : మోనోపాజ్ 40లలోనే వచ్చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి.
పుచ్చకాయ..
అత్యంత హైడ్రేటింగ్ పండ్లలో పుచ్చకాయ కూడా ఒకటి. ఇందులో విటమిన్ ఎ, సి కూడా పుష్కలంగా ఉన్నాయి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jun 29 , 2024 | 11:43 AM