Good Heabits : ఒత్తిడి లేని జీవనానికి 7 అలవాట్లు ఇవే.. !
ABN, Publish Date - Jul 20 , 2024 | 03:11 PM
ఒత్తిడిని వదిలించుకోవడానికి, మానసిక సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఒక అద్భుతమైన మార్గం. వ్యాయామాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల అనేక సమస్యలు దూరం అవుతాయి.
వేగవంతమైన ప్రపంచంలో ఒత్తిడి అనేది సర్వసాధారణం అయిపోయింది. పని ఒత్తిడి నుంచి వ్యక్తగత బాధ్యతల వరకూ అన్నీ గందరగోళ పరిస్థితులే. ఇవి మానసిక ప్రశాంతతో పాటు ఆరోగ్యాన్ని కోల్పోవడం తప్పితే మరేమీ ఉండదు. ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలంటే సాధారణ అలవాట్లను అలవర్చుకోవడమే.
రోజువారి జీవితంలో మనం ఎదుర్కొనే చాలా ఒత్తిళ్ళ నుంచి రిలీఫ్ కావాలంటే జీవన శైలి అలవాట్లను మార్చుకోవడమే. మనమందరం ఒత్తిడి లేని జీవితాన్ని కోరుకుంటున్నాం, కానీ అది ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకోవడం ముఖ్యం. గుండె జబ్బులు, నిరాశ, ఆందోళనతో సహా అనేక ఆరోగ్య సమస్యలతో ఒత్తిడి ముడిపడి ఉందటుంది. ఎప్పుడూ ఒత్తిడిలో జీవిస్తున్నట్లయితే, మన శరీరాలు, మనస్సులు రోగాల బారిన పడతాయి. అందువల్ల, ఒత్తిడి లేని జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం.
దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలింది. ఇది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడం, మంచి అలవాట్లను పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Milk Time : పాలను ఏ సమయంలో తీసుకోవాలి.. !
మంచి అలవాట్లు ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహకరిస్తాయి. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా ఉండటం, మనం పనిచేసే చోట, బంధువులు, స్నేహితులతో సంతోషంగా సమయాన్ని గడిపేందుకు చూడాలి. ఇవేకాకుండా..
రెగ్యులర్ వ్యాయామం: వ్యాయామం కేవలం ఫిట్‌గా ఉండటానికే కాదు, ఇది ఒత్తిడిని వదిలించుకోవడానికి, మానసిక సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఒక అద్భుతమైన మార్గం. వ్యాయామాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల అనేక సమస్యలు దూరం అవుతాయి.
ఆరోగ్యకరమైన ఆహారం: వృద్ధి చెందడానికి సరైన ఆహారంతో శరీరానికి శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవడం శరీరానికి మాత్రమే కాదు, ఇది మనస్సుకు కూడా మంచిది.
Sleeping Health : సరైన నిద్రకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
నాణ్యమైన నిద్ర: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర చాలా అవసరం. ప్రతి రాత్రి కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర రిఫ్రెష్‌గా ఉంచుతుంది.
నేచర్ కనెక్షన్: ఆరుబయట సమయం గడపడం వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. పార్క్‌లో నడక, ప్రకృతితో కనెక్ట్ అవ్వడానికి సహకరిస్తుంది.
Aloo Chaat : వానాకాలం చల్లని సాయంత్రాలు ఈ ఆలూ చాట్ తిని చూడండి..!
నో చెప్పేయండి : మనశ్శాంతిని కాపాడుకోవడానికి నో చెప్పడం నేర్చుకోవడం చాలా అవసరం.
స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి : డిజిటల్ ప్రపంచంలో స్క్రీన్‌లపై ఎక్కువ సమయం గడపడం వల్ల ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి. ఈ సమయం తగ్గించడంవల్ల మంచి నిద్ర పడుతుంది.
సృజనాత్మకత : కాస్త ఒత్తిడి నుంచి రిలీఫ్ తగ్గాలంటే నచ్చిన పని, వ్యాపకం చేయడం అలవాటు చేసుకోవాలి. సంగీతం, నాట్యం, పెయింటింగ్, గార్డెనింగ్ చేయడం మంచిది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 20 , 2024 | 03:11 PM