Energy Levels : శక్తిలేనట్టుగా, అలసటగా ఉంటే తిరిగి శక్తిని పొందేందుకు ఇలా చేయండి..!
ABN, Publish Date - Apr 30 , 2024 | 02:51 PM
అలసిపోవడానికి ప్రధాన కారణం విటమిన్ డి తగినంతగా లేకపోవడం. ఎండలో కాసేపు సమయం గడపడం ద్వారా విటమిన్ డి ని పొందవచ్చు. ఈ డి విటమిన్ లోపం కారణంగా కండరాల అలసట ఉంటుంది. కొవ్వు చేపలు, గుడ్లు, విటమిన్ డి స్థాయిలను పెంచుతాయి.
వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. యుక్తవయసులోనే అలసట, నీరసం ఇబ్బంది పెడుతుంటే మాత్రం, శక్తిని తిరిగి పెంచుకోవడానికి ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి. అసలు అలసట ఇబ్బంది ఎందుకు వేధిస్తుంది. ఇందులో మధుమేహం, గుండె జబ్బులు, కీళ్లనొప్పులు, రక్తహీనత, థైరాయిడ్ వ్యాధి, స్లీప్ అప్నీయా వంటి అనేక అనారోగ్యాలతో అలసట అనేది మామూలు లక్షణం. కానీ సాధారణ వ్యక్తలు కూడా అలసట, నీరసం కారణంగా ఇబ్బంది పడుతుంటే మాత్రం వారు ఈ సమస్యను ఎలా దాటాలనేది చూద్దాం.
మెగ్నీషియం లోపం కారణంగా..
శరీరంలో ఏదైనా ఖనిజ లోపం కారణంగా శక్తి స్థాయిలు తగ్గుతాయి. దీనితో డిప్రెషన్ కి గురి చేస్తుంది. మెగ్నీషియం నాడీ వ్యవస్థకు అవసరం. ఇది శక్తి ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శరీరంలో పెరగాలంేట ఆకు కూరలు, గింజలు, చిక్కుళ్లు వంటివి తీసుకోవాలి.
విటమిన్ డి లోపం..
అలసిపోవడానికి ప్రధాన కారణం విటమిన్ డి తగినంతగా లేకపోవడం. ఎండలో కాసేపు సమయం గడపడం ద్వారా విటమిన్ డి ని పొందవచ్చు. ఈ డి విటమిన్ లోపం కారణంగా కండరాల అలసట ఉంటుంది. కొవ్వు చేపలు, గుడ్లు, విటమిన్ డి స్థాయిలను పెంచుతాయి. ఇనుము లోపం కూడా నీరసం, నిస్సత్తువను తెస్తుంది. దీనికోసం తృణధాన్యాలను, ఆకు కూరలు, పౌల్ట్రీ, మాంసం, చిక్కుళ్లు వంటివి తీసుకోవాలి.
Health Tips : షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన వేసవి పానీయాలు ఇవే..!
విటమిన్ బి12 లోపం
ఈ విటమిన్ శరీరంలో లోపించడం కారణంగా కూడా అలసట ఉంటుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు ఈ విటమిన్ తప్పనిసరి. ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటూ ఉండాలి.
శరీరంలో ఒత్తిడి కారణంగా అలసట, నిస్సత్తువ, కుదురులేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కానీ కొన్ని రకాల మందులతో కూడా అలసట ఉంటుంది. ముఖ్యంగా రక్తపోటు, యాంటిహిస్టామైన్లు, మూత్ర విసర్జనకు మందులు వాడుతున్న కొత్తలో వీరిలో అలసట అనేది ఉన్నట్లయితే వైద్యుని సలహా తీసుకోవడం తప్పనిసరి. అలసిపోయినప్పుడు వ్యాయామం చేయడం శారీరక శ్రమ శక్తి స్థాయిలను తగ్గే విధంగా వ్యాయామాన్ని చేయకూడదు. ఈ చురుకైన వ్యాయామం గుండె, ఊపిరితిత్తులు, కండరాల పని సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ చిట్కాలతో రాత్రిపూట మంచి నిద్ర ఖాయం.. ట్రై చేసి చూడండి..!
1. నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఇది డిహైడ్రేషన్ ను తగ్గిస్తుంది.
2. నిద్రలేకపోవడం కూడా ఇబ్బందులను పెంచుతుంది. మంచి నిద్ర అలవాట్లు ఆరోగ్యాన్ని పెంచుతాయి.
3. గుండె ఆరోగ్యానికి చేపలను ఒమేగా 3 ఆమ్లాలను తీసుకోవాలి.
Read Latest Navya News and Thelugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Apr 30 , 2024 | 03:39 PM