ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Health : ఆస్తమాతో బాధపడుతున్నారా? ఈ దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితి గురించి ఉన్న అపోహలేమిటి..!

ABN, Publish Date - Apr 18 , 2024 | 03:12 PM

ఆస్తమా నాన్ కమ్యూనికేబుల్ వ్యాధి.. ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదు. ఆస్తమా అంటువ్యాధి కాదు. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. ఆస్తమాకు కారణాలు అలెర్జీలు, చిన్ననాటి శ్వాసకోశ వ్యాధులు, తల్లిదండ్రుల్లో ఈ వ్యాధి పూర్వమే ఉండటం వంటి కారకాలతో వ్యాధి పెరుగుతుంది.

Asthma

ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది దీర్ఘకాలిక శ్వాసకోశ రుగ్మత అయిన ఆస్తమా (Asthma )చుట్టూ ఉన్న అపోహలు గురించి మాట్లాడుకుంటే, ముఖ్యంగా ఆస్తమా వల్ల శ్వాస తీసుకునే మార్గాలు సంకోచం, వ్యాకోచంలో, శ్లేష్మం పెగడం వల్ల దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, డిస్ప్నియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆస్తమా పిల్లల్లో దీర్ఘకాలిక వ్యాధిగా ఉంటుంది. అన్ని వయసుల వారు కూడా దీని బారిన పడుతూ ఉంటారు. అయితే ఆస్తమాకు సంబంధించిన కొన్ని అపోహల గురించి తెలుసుకుందాం.

అపోహ.. ఆస్తమా అంటువ్యాధి..

వాస్తవం.. ఆస్తమా నాన్ కమ్యూనికేబుల్ వ్యాధి.. ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదు. ఆస్తమా అంటువ్యాధి కాదు. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. ఆస్తమాకు కారణాలు అలెర్జీలు, చిన్ననాటి శ్వాసకోశ వ్యాధులు, తల్లిదండ్రుల్లో ఈ వ్యాధి పూర్వమే ఉండటం వంటి కారకాలతో వ్యాధి పెరుగుతుంది. అంతే కాకుండా ఆస్తమా వైరల్ రెస్పిరేటరీ ఇన్ ఫెక్షన్ల వల్ల కూడా రావచ్చు. ఇది ఫ్లూ, జలుబు వంటి వాటి ద్వారా వస్తుంది.

అపోహ.. ఆస్తమా ఔషధం వ్యసనానికి కారణం అవుతుంది.

వాస్తవం.. ఉబ్బసం కోసం వాడే మందులు చాలా సురక్షితమైనవి. ఇవి ఆస్తమాను తగ్గిస్తాయి. అనారోగ్యం, దీర్ఘకాలిక స్వభావం కారణంగా ఆస్తమాకు తరచుగా మందులు వాడాల్సి వస్తుంది. అంతేకానీ.. ఇవేమీ వ్యసనంగా మారే అవకాశం లేదు.

Cooking Tips : వంట సులభంగా, ఇబ్బంది లేకుండా చేయడానికి ఈ చిట్కాలు పాటించండి..!


అపోహ.. ఆస్తమా ఉన్నవారు వ్యాయామం చేయకూడదు.

వాస్తవం.. ఫిట్ నెస్ కోసం ఆస్తమా నియంత్రణలో ఉన్నట్లయితే వైద్య సలహాతో వ్యాయామం చేయవచ్చు. తరచుగా వ్యాయామం చేయడం వల్ల సాధారణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు దీర్ఘకాలిక ఆస్తమా నియంత్రణను ప్రోత్సహిస్తుంది.

అపోహ.. కాలక్రమేణా, ఆస్తమా మందులు దాని ప్రభావాన్ని కోల్పోతాయి. పనిచేయకపోవచ్చు.

వాస్తవం.. తరచుగా ఉపయోగించినంత మాత్రాన మందుల సమర్థత తగ్గదు. ఉబ్బసం తగ్గాలంటే ఉపయోగించే మందులు కంట్రోలర్లు, రిలీవర్లు నియంత్రణకు వాడే మందులు క్రమంగా పనిచేస్తాయి. ఇవి ఎక్కువకాలం వాడటం వల్ల శరీరంమీద పనిచేయకపోవడం ఏమీ ఉండదు. వైద్యుల సలహా మేరకు మందులను మార్చడానికి అవకాశం ఉంటుంది.

ychee benefits : వేసవిలో లీచీ ఫ్రూట్ తీసుకుంటే.. రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు..!

అపోహ.. ఆస్తమా ఉన్నవారు అది తీవ్రంగా ఉన్నప్పుడే మందులు వాడాలి.

వాస్తవం.. ఆస్తమా ఉన్నవారు అది ఉన్న తీవ్రతను బట్టి మందులు వాడుతూ ఉంటారు. శ్వాసలో గురక, దగ్గు, ఛాతీ బిగుతుగా ఉండి, శ్వాస ఆడకపోవడం వంటి ఆస్తమా లక్షణాలు తరచుగా పెరుగుతూ ఉంటాయి. అనారోగ్యం లక్షణాలు లేనప్పుడు కూడా చికిత్స అవసరం పడుతూ ఉంటుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 18 , 2024 | 04:20 PM

Advertising
Advertising