ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips : క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే రెడ్ ముల్లంగి

ABN, Publish Date - Aug 15 , 2024 | 08:17 AM

ముల్లంగి ఆకులు, వేరు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది. ఆకులు ఎపికాటెచిన్ వంటి ఫ్లెవనాల్‌లను సరఫరా చేస్తాయి. ముల్లంగిలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది ఫైటోన్యూట్రియెంట్‌లతో కలిసి, వృద్ధాప్యం లేదా అనారోగ్యకరమైన జీవనశైలి హానికరమైన ప్రభావాల నుంచి శరీర కణాలను రక్షించడంలో సహాయపడుతుంది.

Health Benefits

ముల్లంగి ప్రతి ఒక్కరూ తప్పక తినాల్సిన కూరగాయలలో ఒకటి. ముల్లంగి క్రూసిఫెరా కూరగాయ. తెలుపు, నలుపు, పసుపు, గులాబీ, ఎరుపు రంగుల్లో కనిపించే ఈ కూరగాయను గుర్రపు ముల్లంగి, అడవి ముల్లంగి అని కూడా పిలుస్తారు. ఇది వాసబి రూట్ ఎంజైమ్‌ల నుంచి వస్తుంది. ముల్లంగి ఆగ్నేయ లేదా ఆసియాకు చెందినవి. గ్రీకులు, రోమన్లు వీటిని ఔషధంగా ఉపయోగించే వారు. వేల సంవత్సరాల క్రితం అడవి ముల్లంగిని చాలా వరకూ తినేవారు. ఇదే ప్రస్తుతం అంతా తింటున్న ముల్లంగి. ఇది రకరకాలున్నాయి. తెల్లటి కండతో గుండ్రంగా ఉంటాయి. చెర్రీ బెల్లె, ఎర్లీ స్కార్లెట్ గ్లోబ్ రెండు సాధారణ రకాలు.

డైకాన్.. జపాన్, చైనాకు చెందినవి. ఆసియా వంటకాలలో ప్రధానంగా వాడతారు. జపనీస్ ముల్లంగి, ఇవి గుండ్రంగా సిలిండర్ ఆకారంలో ఉంటాయి. ఆకుపచ్చ రంగులో ఉంటాయి. బ్రాసికా కుటుంబానికి చెందిన ఇతర సభ్యుల మాదిరిగానే, ముల్లంగి సల్ఫోరాఫేన్ గా మార్చబడే సమ్మేళనాన్ని సరఫరా చేస్తుంది. ఈ సల్ఫర్ ఫైటోకెమికల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యానికి మంచిది.

ముల్లంగి సల్ఫోరాఫేన్, ఆంథోసెనిన్స్ వంటి ఇతర మొక్కల సమ్మేళనాల మూలంగా గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.


Skin Care : చర్మం పొడిబారుతుంటే దానికి కారణాలు, నివారణలు ఇవిగో...!

యాంటీఆక్సిడెంట్లు..

ముల్లంగి ఆకులు, వేరు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది. ఆకులు ఎపికాటెచిన్ వంటి ఫ్లెవనాల్‌లను సరఫరా చేస్తాయి. ముల్లంగిలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది ఫైటోన్యూట్రియెంట్‌లతో కలిసి, వృద్ధాప్యం లేదా అనారోగ్యకరమైన జీవనశైలి హానికరమైన ప్రభావాల నుంచి శరీర కణాలను రక్షించడంలో సహాయపడుతుంది.

కాలేయ పనితీరు జీర్ణక్రియకు..

ముల్లంగి, నల్ల ముల్లంగి జీర్ణవ్యవస్థ ద్వారా కొవ్వులను జీర్ణం చేయడానికి కాలేయం నుంచి విషాన్ని వ్యర్థ పదార్థాలను తొలగించడానికి సహకరిస్తుంది.

Tulasi Plant : వర్షాకాలంలో తులసి మొక్కను ఎలా పెంచాలో తెలుసా..!

ముల్లంగి సురక్షితమేనా..

ముల్లంగి చాలా ఆరోగ్యకరమైనది. కానీ థైరాయిడ్ సమస్య ఉన్నవారు దీనిని తినడం తగ్గిస్తే మంచిది. ఈ కూరగాయలు థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన అయోడిన్ శోషణకు ఆటంకం కలిగిస్తాయి. ముల్లంగి తింటే అలెర్జీ రావడం అనేది అరుదు.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Aug 15 , 2024 | 08:17 AM

Advertising
Advertising
<