ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fatty Liver Disease : పిల్లల్లో ఈ వ్యాధి పెరిగేందుకు కారణాలు, సంకేతాలు..

ABN, Publish Date - Jun 27 , 2024 | 03:41 PM

షుగర్, ఊబకాయం ఇప్పుడు ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం పిల్లల్లో పెరిగింది. పెద్దవారిలో ఈ ప్రమాదం ఎలా పెరుగుతుందో పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతుంది.

fatty liver disease

సరైన జీవనశైలి లేని కారణంగా పెద్దల్లో కాలేయ వ్యాధి, లివర్ డిసీజ్ వచ్చే అవకాశం చాలా వరకూ ఉంది. అదే పిల్లల్లో కూడా పెరిగేందుకు అవకాశం చాలా వరకూ ఉంది. దీనికి ప్రధాన కారణం అనారోగ్యగరమైన కొవ్వులు, చక్కెరలు అధికంగా ఉన్న అల్ట్రాప్రాసెస్ట్ ఆహారాలు, చిన్నతనం నుంచే సరైన శరీరక శ్రమలేకపోవడం, ఆటలతో శరీరం కదలకపోవడం, దీని కారణంగా చిన్న వయసులోనే ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఆరుబయట ఆటలకు పిల్లలు దూరం కావడం వారి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.

రోజుకు ఆరుగంటల పాటు శరీరక శ్రమ చేయని పిల్లల్లో ఈ వ్యాధి ప్రమాదం 33 శాతం తగ్గుతుంది. దీనివల్ల తల్లిదండ్రులు ఆరుబయట ఆడుకునే అవకాశం ఇవ్వాలి. క్రీడలు ఆడే పిల్లల్లో ఈ ఫ్యాటీ లివర్ సమస్య 33శాతం తగ్గుతుంది.

పిల్లల్లో పెరుగుతున్న వ్యాధి..

షుగర్, ఊబకాయం ఇప్పుడు ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం పిల్లల్లో పెరిగింది. పెద్దవారిలో ఈ ప్రమాదం ఎలా పెరుగుతుందో పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతుంది. దీనికి కారణాలు..

1. జంక్ ఫుడ్ తీసుకోవడం, ఇది జీర్ణం కాకుండానే పడుకోవడం

2. చెమట పట్టకుండా నీడపట్టునే ఉండటం

3. జీర్ణ వ్యవస్థకు కష్టతరం కావడం

4. శరీరం అలిసే అవకాశం లేకుండా ఉండటం

5. ఇవన్నీ కాలేయాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ ప్రమాదం వెనుకే కాలేయ సిర్రోసిస్, ఫైబ్రోసిస్, క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.


Biotin Rich Foods : ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం కోసం బయోటిన్ రిచ్ ఫుడ్స్ వీటిని తీసుకుంటే..

కాలేయ సమస్యకు కారణాలు..

1. వేయించిన ఆహారం తీసుకోవడం

2. మసాలా ఆహారం తీసుకోవడం

3. జంక్ ఫుడ్

4. శుద్ధి చేసిన చక్కెర

5. మద్యం

ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే వ్యాధులు

1. అధిక కొలెస్ట్రాల్

2. ఊబకాయం

3. మధుమేహం

4. థైరాయిడ్

5. స్లీప్ అప్నియా

6. అజీర్ణం

Herbs And Spices : కిడ్నీ, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఇవే..

జంక్ ఫుడ్, బద్దకం వంటివి వదిలేసి, కాలేయం సరిగ్గా పనిచేయడానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలి. జీవనశైలిలో మార్పులు, మంచి నిద్ర, ఆహారంలో సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, శరీర శ్రమ, గేమ్స్, ఒత్తిడి లేకుండా ఉండటం ఇవన్నీ కూడా చాలా అవసరం.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 27 , 2024 | 03:41 PM

Advertising
Advertising