ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Heart Beat : గుండె కొట్టుకోవడంలో తేడాలు.. దీనికి కారణాలు, లక్షణాలు ఇవే.. !

ABN, Publish Date - Jul 04 , 2024 | 03:38 PM

గుండె తక్కువగా కొట్టుకోవడాన్ని వైద్య భాషలో అరిథ్మియా అంటారు. ఇది హృదయస్పందనలను, గుండె ఉన్న పరిస్థితులను ఎలక్ట్రోలైట్ సమతుల్యత, ఒత్తిడి, మందుల కారణాల వల్ల రావచ్చు.

Heart Health

శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. దీనికి ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే శరీర మనుగడ చాలా ప్రశ్నార్థకంగా మారిపోతుంది. గుండె నీరసంగా ఉన్నా, గుండె కొట్టుకునే విధానంలో మార్పులు గమనించినా ఆలస్యం చేయకుండా వైద్య సంరక్షణను పొందడం ముఖ్యం. అసలు గుండె తక్కువగా కొట్టుకుంటుందనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి. ఈ సమస్యకు పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందాం.

గుండె తక్కువగా కొట్టుకోవడాన్ని వైద్య భాషలో అరిథ్మియా అంటారు. ఇది హృదయస్పందనలను, గుండె ఉన్న పరిస్థితులను ఎలక్ట్రోలైట్ సమతుల్యత, ఒత్తిడి, మందుల కారణాల వల్ల రావచ్చు. ఇలా సక్రమంగా లేని గుండె స్పందనల కారణంగా తప్పక వైద్య సహాయం అవసరం. దీనికోసం..

అరిథ్మియా అంటే..

అరిథ్మియా అనేది గుండె లయలో తేడాలను అరిథ్మియా అంటారు. ఒక్కొక్కటి దాని స్వంత లక్షణాలు, కారణాలు తెలుసుకోవడం ముఖ్యం.

Boost Immunity : డెంగ్యూ జ్వరం ఉన్నప్పుడు రోగి ఈ పండ్లు తీసుకుంటే సరి ..!

అరిథ్మియా రకాలు..

కర్ణిక దడ.. AFIB ఇది అరిథ్మియాస్‌లో ఒకటి. వేగంగా గుండె కొట్టుకోవడాన్ని ఇలా పిలుస్తారు. ఈ లక్షణం ఉన్నవారు దడ, ఊపిరి ఆడకపోవడం, అలసట, తల తిరగడం వంటి లక్షణాలతో ఇబ్బంది పడతారు. AFIB లక్షణాలు కొందరిలో ముఖ్యంగా కనిపిస్తాయి. అవి అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం, అధిక మద్యపానం తీసుకునేవారు ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది.

AFIB లానే కనిపించే కర్ణిక ఫ్లట్టర్ గుండె దడతోపాటు, ఛాతీలో అసౌకర్యం, అలసట కనిపిస్తాయి.


Rainy Season : వానాకాలం ఈ శుభ్రత పాటిస్తున్నారా.. లేదంటే వ్యాధులు తప్పవ్..!

వెంట్రిక్యులర్ టాచీకార్డియా.. వెంట్రిక్యులర్ టాచీకార్డియా అనేది ప్రాణాంతక అరిథ్మియా, ఇది గుండె గదులలో కలిగే సమస్య.. గుండె గదుల్లో గుండె వేగంగా కదలడం, లేదా వేగంలేకపోడం కనిపిస్తుంది. దీనిలో మైకము, ఛాతీలో నొప్పి, మూర్చ వంటి లక్షణాలు ఉంటాయి. వెంట్రిక్యులర్ టాచీకార్డియా అంటే గుండె జబ్బలు, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, గుండెపోటు ఉన్నవారిలో ఈ లక్షణాలుంటాయి.

వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్.. వెంట్రిక్యులర్ ఫ్రైబ్రిలేషన్ అనేది తీవ్రమైన అరిథ్మియా, ఇది ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌కు దారితీస్తుంది. ఇందులో గుండె సరిగా కొట్టుకోకపోవడం, స్పృహకోల్పోవడం, పల్స్ లేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. ఈ లక్షణాలు ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారిలో ఉంటాయి.

బ్రాడీకార్డియా.. బ్రాడీకార్డియా అనేది నెమ్మదిగా గుండె కొట్టుకోవడం, నిమిషానికి 60 బీట్ల కంటే తక్కువగా ఉంటే, అలసట, తల తిరగడం, మార్చపోవడం వంటి లక్షణాలుంటాయి. బ్రాడీకార్డియా కారణాలలో వృద్ధాప్యం, గుండె జబ్బులు ఉన్నవారిలో ఈ లక్షణాలు కలిగినవారిలో ఉంటాయి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 04 , 2024 | 03:38 PM

Advertising
Advertising