ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Foot Problems: పాదాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటే ఇలా చేయండి..!

ABN, Publish Date - Sep 10 , 2024 | 09:47 AM

పాదాల సమస్యలు చాలా వరకూ మామూలుగా వస్తూనే ఉంటాయి. వీటిని కొద్దిగా పట్టించుకోకపోయినా నడవడానికి కూడా ఇబ్బంది పడేలా మారతాయి. పాదాలు బొబ్బలు రావడం, పగిలి మడమలు నొప్పి రావడం నుంచి ఉపశమనం పొందాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటించాలి.

Foot Problems

శరీరం బరువునంతా మోసేది పాదాలే.. అంత బరువూ మోస్తూ సున్నితంగా ఉండే పాదాల ఆరోగ్యం మీద కాసింత ఎక్కువ శ్రద్ధ చూపాల్సిందే. పాదాలు నొప్పిగా ఉండటం, నడవనీయకపోవడం సర్వ సాధారణంగా అందరిలో కనిపించే సమస్య. సరైన పాదరక్షలు ఎంచుకోకపోవడం, పాదాల శుభ్రత సరిగా ఉండకపోవడం, ఎత్తైన పాదరక్షలు ఎంచుకోవడం ఇలాంటి పాదాల సమస్యల నుంచి అసౌకర్యం నుంచి ఉపశమనం పొందాలంటే ఇలా చేయండి.

పాదాల సమస్యలు చాలా వరకూ మామూలుగా వస్తూనే ఉంటాయి. వీటిని కొద్దిగా పట్టించుకోకపోయినా నడవడానికి కూడా ఇబ్బంది పడేలా మారతాయి. పాదాలు బొబ్బలు రావడం, పగిలి మడమలు నొప్పి రావడం నుంచి ఉపశమనం పొందాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటించాలి. పాదాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ పద్దతుల్ని ట్రై చేస్తే సరి.

సోక్ లేదా మాయిశ్చరైజ్..

అలసిపోయిన, పగిలిన పాదాలు నడవడానికి ఇబ్బందిగా మారతాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం కలగాలంటే గోరు వెచ్చని నీటిలో పాదాలను ఉంచి, ఎప్సమ్ లవణం, లేదా లావెండర్ వంటి నూనెలను వేయాలి. కాసేపటి తర్వాత పాదాలను మాయిశ్చరైజర్ లేదా ఫట్ క్రీమ్ రాసి తీయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పాదాలు మరీ తేమ లేకుండా ఉండేందుకు రాత్రి పూట సాక్స్ వేసుకుంటే సరిపోతుంది.


Smoking Habit: ధూమపానం చేస్తున్నారా..! మీ హెల్త్ ఎంత వరకూ పాడైందో ఇలా తెలుసుకోండి..!

సరైన పాదరక్షలు ఎంచుకోండి.

పాదాలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పాదరక్షలు, బూట్లు ఎంచుకోవాలి. శరీర బరువుకు తగినట్టుగా, పాదాల నొప్పి, బొటన వేలు నొప్పి కలగకుండా ఉంటే బూట్లను ఎంచుకోవాలి. పాదాల నొప్పి ఉన్నవారు మంచి ఆర్చ్ సపోర్ట్ ఉన్న కుషనింగ్ ఉండే షూలను ఎంచుకోవాలి.

పాదాలకు వ్యాయామం..

పాదాల వ్యాయామాలు, స్ట్రెచ్‌లు నొప్పిని తగ్గించడంలో, అరికాలి ఫాసిటిస్ వంటి సమస్యలను తగ్గించడంలో సహకరిస్తాయి. పాదాల కింద టెన్నిస్ బాల్ ఉంచి నొక్కి వదలడం వంటి వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పాదాల కండరాలను సాగేలా చేస్తాయి.

Health Tips : ఈ మసాలా దినుసు వాడితే చాలు.. రక్తంలో చక్కెర స్థాయిలు ఇట్టే కంట్రోల్లోకొస్తాయి.. !!


పాదాల శుభ్రత..

పాదాల సమస్యలు ఎక్కువ కాకుండా ఉండాలంటే తగినంత పరిశుభ్రతను పాటించడం కూడా ముఖ్యం. సబ్బు నీటితో ప్రతిరోజూ పాదాలను కడుగుతూ ఉండాలి. పాదాలు బాగా పొడిగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కాలి మధ్య తేమ లేకుండా చూడాలి. ఇలా ఉండటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా చెమట పట్టే వారు సాక్స్ ధరించడం, టైం ప్రకారం సాక్స్ మార్చుతూ ఉండటం ముఖ్యం. సరైన పాదరక్షలను ఎంచుకోవడంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. బరువు ఎక్కువ ఉండేవారు మరీ ఎత్తుగా ఉండే పాదరక్షలను వాడకపోవడమే మంచిది.

పాడియాట్రిస్ట్..

పాదాల నొప్పులు ఎక్కువగా ఉండే వారిలో ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంటే పాడియాట్రిస్ట్‌ను సంప్రదించడం మంచిది. నొప్పులకు కారణాలు, హీల్ స్పర్స్, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలను గమనించి చికిత్స అందిస్తారు. దీనివల్ల చిన్న చిన్న సమస్యలు తీవ్రంగా మారకుండా చేయవచ్చు.

Read LatestNavya NewsandTelugu News

గమనిక:పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Sep 10 , 2024 | 09:47 AM

Advertising
Advertising