ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Super Food : గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆకుపచ్చ గోధుమ గురించి తెలుసా.. !

ABN, Publish Date - Aug 08 , 2024 | 12:02 PM

ఈ గోధుమ నూక జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహకరిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇవి గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Health Benefits

గోధుమలతో మనం చపాతీ, పరోటాలను తయారు చేస్తాం. గోధుమలో అనేక ఆరోగ్యప్రయోజనాలను అందించే గుణం ఉందని మనకు తెలుసు. బియ్యం తరువాత చాలా వరకూ తినే ఆహార ధాన్యాలలో గోధుమ ప్రధానంగా ఉంది. గోధుమ పిండిని చపాతీలుగా చేసుకుని బరువు తగ్గాలనుకునేవారు రాత్రిపూట ఒకటి, రెండు తింటూ ఉంటారు. దీనితో బరువు తగ్గడమే కాదు, శరీరాన్ని తేలిగ్గా ఉంచడంలోనూ గోధుమలు సహకరిస్తాయి. గోధుమలు పూర్వకాలం నుంచి వస్తున్న ధాన్యం. ఈ గోధుమకు దగ్గరి సంబంధం ఉన్న ధాన్యమే ఆకుపచ్చ గోధమ. దీనిని ఫ్రీకే అని పిలుస్తారు. అంచం మామూలు గోధుమలను పోలి ఉండే ఈ ధాన్యంలో అనేక పోషకాలున్నాయి.

ఆకుపచ్చ గోధుమను ఉత్తర అమెరికాలో ప్రధాన పంటగా పండిస్తారు. ఈ గోధుమతో నూక చేసి అన్నంగానే ఎక్కువగా తీసుకుంటారు. ఆకుపచ్చ గోధుమలో అధిక ప్రోటీన్ కండరాలను దృఢంగా చేస్తుంది. ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ రోగనిరోధక శక్తికి, ఎముకల ఆరోగ్యం పెంచేందుకు, జీవక్రియకు ముఖ్యంగా పనిచేస్తాయి.


Festival Time : హరియాలీ తీజ్ వేడుకల్లో ఖీర్ ఎందుకు చేస్తారు?

మెదడుకు ఆరోగ్యం..

ఫ్రీకేలో విటమిన్ బి, ఐరన్ ఉన్నాయి. ఇవి తెలివితేటల్ని పెంచేందుకు సహకరిస్తాయు. ఐరన్ మెదడుకు ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతాయి.

గుండె ఆరోగ్యానికి..

ఆకుపచ్చ గోధుమలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫ్రీకేలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.

అధిక ప్రోటీన్..

బరువు తగ్గేలా చేస్తుంది. తినాలనే కోరికను అదుపు చేస్తుంది. కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది.


Health Tips : ఖాళీ కడుపుతో ఉదయాన్నే నీరు తాగడం ఆరోగ్యమేనా..!

ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక ఈ గోధుమ నూక జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహకరిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇవి గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇందులోని ప్రోటీన్, ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ల కలయికతో బరువు తగ్గుతారు. అధిక ఫైబర్ కారణంగా కడుపు నిండుగా ఉంటుంది. తిన్న తరువాత నెమ్మదిగా విడుదలయ్యే శక్తితో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగనీయదు. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Aug 08 , 2024 | 12:56 PM

Advertising
Advertising
<