Health Tips : శరీరాన్ని ఆరోగ్యంగా, దృఢంగా మర్చేసే దీని గురించి తెలుసా.. ఒక్క స్పూన్ తింటే చాలు..!
ABN, Publish Date - Jun 19 , 2024 | 03:14 PM
ఉబకాయాన్ని తగ్గించడంలో, మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. స్పిరులినా ప్రయోజనలలో కండారాల బరువును పెంచడంలో కూడా సహాయపడుతుంది.
స్పిరులినా నిద్రకు భంగం కలిగించే కారకాలతో పొరాడుతుంది. ఇందులో ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటుంది. శరీరాన్ని లోపలి నుంచి బలంగా మార్చేందుకు విటమిన్లు, ఖనిజాలు పోషకాలు అవసరం. అయితే వీటిని తీసుకోవాలంటే ఒక్క ఫుడ్స్ తీసుకోవడంతోనే సాధ్యంకాదు. దీనికి పోషకాలను సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవడం కూడా అవసరం. స్పిరులినా శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలను అందించే సూపర్ ఫుడ్ గా ఉంటుంది. స్పిరులినాలో అత్యధికంగా ప్రోటీన్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, కాపర్, ఫైబర్ అనేక మినరల్స్ ఉంటాయి. 100 గ్రాముల స్పిరులినాలో 50 నుంచి 60 గ్రాముల వరకూ ప్రోటీన్ ఉంటుంది. స్పిరులినా ప్రయోజనాలు పోషకాలు..
స్పిరులినా అనేది నీలం ఆకుపచ్చ ఆల్గే ఉత్పత్తి. ఇది ఒక రకంగా నాచు పదార్థం. దీనిని ప్రత్యేకంగా పండిస్తారు. దీనిని రెండు నెలలపాటు రోజుకు 19 గ్రాముల చొప్పున తీసుకుంటే మంచిది. దీనితో ఎన్ని ఉపయోగాలంటే.. గ్యాకామోల్, హమ్ముస్ లతో కలిపి పాప్ కార్న్, సలాడ్స్ లలో కలిపి కూడా తీసుకోవచ్చు. ఎనర్జీ బార్స్ లలో కలిపి తీసుకోవచ్చు. దీని రుచి మట్టి, చేపల రుచికి దగ్గరగా ఉంటుంది. వీటిని క్యాప్సూల్, టాబ్లెట్ రూపంలో తీసుకోవచ్చు.
1. స్పిరులినా అనేది నీలం ఆకుపచ్చ పదార్థం. దీనిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి, హైపర్యాక్టివిటీ డీజార్డర్, అలెర్జీలు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. ఆక్సీకరణను అణిచివేస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
2. ఉబకాయాన్ని తగ్గించడంలో, మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. స్పిరులినా ప్రయోజనలలో కండారాల బరువును పెంచడంలో కూడా సహాయపడుతుంది.
Health Tips : మహిళల ఆరోగ్యంలో ముఖ్యంగా పిరియడ్స్ సమస్యల నుంచి రిలీఫ్ ఇచ్చే ఈ మసాలా గురించి తెలుసా..!
3. విటమిన్ బి12 సమృద్ధిగా ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. స్పిరులినా ఒత్తిడిని తగ్గించడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
4. అమినో యాసిడ్స్.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రోటీన్ తో పాటు అమినో యాసిడ్‌లు కూడా అవసరం. ఇవి గ్యాస్ట్రిక్, డ్యూడెనల్ అల్సర్లను నయం చేయడంలో సహకరిస్తాయి. జీర్ణక్రియకు సహాయపడుతుంది.
5. స్పిరులినాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గురణాలున్నాయి అలెర్జిక్ రినైటిస్ సమస్య నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jun 19 , 2024 | 03:14 PM