ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Health Tips : టీ, కాఫీలకు బదులుగా ఎన్ని తెలుసా.. వీటిని తీసుకుంటే..

ABN, Publish Date - Jun 07 , 2024 | 10:38 AM

కెఫీన్ అనేది టీ, కాఫీలలలో అధికంగా ఉంటుంది. మగతగా, అలసిపోయినట్టుగా ఉన్న సమయంలో వేడి వేడిగా వీటిని తీసుకోవడం వల్ల రిలాక్స్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. రోజులో కొన్ని కప్పుల టీ, కాఫీ కాగడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థను సక్రియ చేస్తుంది. ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.

Health Tips

ఉదయాన్నే టీ, కాఫీలు తాగడం అందరికీ అలవాటుగా మారిపోయింది. కాస్త తలుపోటుగా ఉన్నా, అలసట, నీరసంగా అనిపించినా కూడా కాఫీ, టీలు తాగేస్తూ ఉంటాం. ఇది ఆరోగ్యం మీద చెడు ప్రభావాన్ని కూడా చూపుతూ ఉంటుంది. అయితే అలవాటు మరీ ఎక్కువగా ఉన్నవారు ఆరోగ్యకరమైన పానీయాల వైపు వెళ్ళి సరిచేసుకోవచ్చు. ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయి. దానితో పాటు మంచి అలవాటుగా కూడా మారతాయి. టీ, కాఫీలలో ఉండే కెఫిన్ వంటి రసాయం బారిన మరీ పడిపోకుండా చేస్తాయి. ఉత్సాహం, ఉల్లాసం కూడా తోడవుతాయి. అయితే ఏదైనా ఎక్కువగా తాగితే ఆరోగ్యం మీద పెద్ద ఎఫెక్ట్ చూపించే రోజులు కావడం వల్ల కాఫీ, టీలకు బదులు ఆరోగ్యకరమైన పానీయాలను ఎవి ఎంచుకోవాలంటే..

టీ,కాఫీలు మరీ ఎక్కువగా తీసుకునేవారు..

కాఫీ, టీలు ఎక్కువగా తాగేవారు, ఆందోళన, విశ్రాంతి లేకపోవడం, నిద్రలేమి, అధిక రక్తపోటు వంటి సమస్యలకు గురవుతుంటారు. రెగ్యులర్ గా తీసుకునే ఈ కాఫీ టీలకు ప్రత్యామ్నాయాలుగా వేటిని ఎంచుకోవాలంటే..

కెఫీన్ అనేది టీ, కాఫీలలలో అధికంగా ఉంటుంది. మగతగా, అలసిపోయినట్టుగా ఉన్న సమయంలో వేడి వేడిగా వీటిని తీసుకోవడం వల్ల రిలాక్స్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. రోజులో కొన్ని కప్పుల టీ, కాఫీ కాగడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థను సక్రియ చేస్తుంది. ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. అదే రోజుకు నాలుగు కప్పుల టీని తాగితే మాత్రం ఆందోళన, విశ్రాంతి లేనట్టుగా అనిపిస్తుంది. రక్తపోటు కూడా పెరుగుతుంది.


కొంబుచా..

ఇది పులియబెట్టి తయారు చేస్తారు. ఈ టీ ఆరోగ్యకరమైనది. హానికరమైన బ్యాక్టీరియాను చంపగలదు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. బాక్టీరియా, ఈస్ట్, చక్కెరతో పులియబెట్టిన బ్లాక్ టీ రూపమే కొంబుచా ఇది ఉదయాన్నే తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

మచా టీ..

గ్రీన్ టీ వలె మాచా కూడా కామెల్లియా సినెన్సిస్ మొక్క నుండి వస్తుంది. అయితే ఇది విభిన్నంగా పెరుగుతుంది. తేయాకు ఆకులను కోసిన తర్వాత మాచా అని పిలవబడె చక్కటి పొడిగా ఉంటుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాలేయాన్ని రక్షిస్తుంది. మెదడు పనితీరును పెంచుతుంది. క్యాన్సర్, గుండె ఆరోగ్యాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.

పసుపు పాలు..

పసుపు పాలు అని కూడా గోరువెచ్చని పాలలో అల్లం, దాల్చిన చెక్క, పసుపు, నల్ల మిరిగాయలు ద్రవ్యాలను కలిపి తేనె తో తీసుకుంటే ఈ పానీయం చక్కని రుచితో పాటు మంది ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

పిప్పరమింట్ టీ..

పిప్పరమింట్ టీ దీనిని తీసుకోవడం వల్ల అనేక తేనె, గోరువెచ్చని నీరు, సబ్జా గింజలు, పుదీనా ఆకులు కలిపి తీసుకుంటే చక్కని రుచి, చక్కని ఆరోగ్యం కూడా సొంతం అవుతుంది. పుదీనా ఆకులు ఎంత తాజాగా ఉంటే అంత మంచిది. అంత రుచి కూడానూ.

Eye Health : కంటి ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి..?


నిమ్మకాయ నీరు..

నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఉదయాన్నే తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. విటమిన్ సి ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని ఎండ దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మం నిర్మాణానికి కొల్లాజెన్ అనే ప్రోటీన్ ను పెంచేందుకు ఈ పానీయం అవసర పడుతుంది.

చమోనిలే

ఈ టీ నిద్ర బాగా ఉంటుంది. నిరాశ, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఒత్తిడి తీవ్రతను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరను తగ్గించడం, నిద్ర, విశ్రాంతి వంటివి పెరుగుతాయి.

అల్లం టీ..

స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన పానీయం ఇది. దీనిని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 07 , 2024 | 10:38 AM

Advertising
Advertising