Health Benefits : మెంతి మొలకలు రోజూ తినడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ తెలుసా..!
ABN, Publish Date - Jul 31 , 2024 | 12:50 PM
మెంతి మొలకల్లో కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలున్నాయి.
ప్రతిరోజూ ఆహారంలో మెంతులు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పోషకాలు అధికంగా ఉండే మెంతి మొలకలను రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల ఇవి శరీరానికి సూపర్ ఫుడ్‌గా పనిచేస్తాయి. ఇంకా వీటితో..
మెంతులు మన భోజనంలో అధిక ప్రాధాన్యత కలిగిన దినుసుగా వాడుతూ ఉంటాం. మెంతుల్లో అనేక పోషకాలున్నాయి. ఆహారంలో మెంతులు కలపడం వల్ల వాటికి ఉన్న ప్రత్యేకమైన సువాసన, రుచి పదార్థాలకు కొత్త రుచిని తీసుకువస్తాయి. మెంతులే కాకుండా మెంతి ఆకులు కూడా పప్పు, పులుసు వంటి పదార్థాలకు వాడుతూ ఉంటాం. ఊరగాయలలో కూడా మెంతులు ప్రధానంగా వాడతాం. మెంతులను మెలకెత్తిన వాటిని తీసుకుంటే ఇంకా అనేక పోషకాలు శరీరానికి అందుతాయి.
ఇవి రోజూ తీసుకుంటే..
మెంతి మొలకల వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర నియంత్రణకు సహకరిస్తాయి. జీర్ణశక్తి సాఫీగా సాగుతుంది.
మెరుగైన జీర్ణక్రియ..
మెంతి మొలకల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సాధారణ ప్రేగు కదలికలకు, మలబద్దకాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
Health Tips : కాల్చిన అల్లం, తేనెతో జలుబు, గొంతు నొప్పికి చెక్ పెట్టండిలా... !
రక్తంలో చక్కెర స్థాయిలు..
మొలకలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే సామర్థ్యానికి, ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటాయి.
మెరుగైన జీవక్రియ..
మెంతి మొలకలు విటమిన్లు, ఖనిజాలు అధిక కంటెంట్ కారణంగా జీవక్రియను పెంచుతాయి. ఇవి బరువును నియంత్రించడంలో సహకరిస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లు..
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే మెంతి మొలకలు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటాయి. శరీరంలో వాపును తగ్గిస్తాయి. శరీరంలో కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Health Tips : తిన్న తర్వాత విషంగా మారే ఆహారపదార్ధాలు ఇవే..
గుండె ఆరోగ్యం..
మెంతి మొలకలు క్రమం తప్పకుండా తీసుకంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో, గుండె పనితీరును మెరుగుపరచడంలో సహకరిస్తాయి.
మెంతులు మంచి చర్మానికి, విటమిన్లు, ఖనిజాలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. మొటిమలను తగ్గించడం, ఆరోగ్యకరమైన చర్మానికి కారణం అవుతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, చర్మాన్ని నిగారింపుతో ఉండేలా చేస్తాయి.
ఎముకల ఆరోగ్యానికి కూడా మెంతులు మంచివి. మెంతి మొలకల్లో కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలున్నాయి. ఇవి బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలకు సహాయపడతాయి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 31 , 2024 | 03:05 PM