ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips : ముఖం, కళ్లపై కనిపించే గుండెపోటుకు సంబంధించిన సంకేతాలు తెలుసా..

ABN, Publish Date - Aug 05 , 2024 | 11:41 AM

గుండె కొట్టుకునే వ్యవస్థలో ఇబ్బంది కలిగితే కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. దానితో క్షణాల్లో గుండె ఆగిపోయి, మరణంచే అవకాశం ఉంటుంది

Health Benefits

అప్పటి వరకూ సాధారణంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న ఆరోగ్యం గుండె పోటు రావడంతోనే మొత్తం ఆందోళనలోకి తోసేస్తుంది. సరైన జీవనశైలి విధానం లేకపోవడం, శరీరానికి తగిన వ్యాయామం ఉండకపోవడం ప్రధాన కారణాలైతే, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తున్నవారిలో, గుండె పోటు ఆకస్మికంగా ఎందుకు వచ్చిందనే విషయం మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. సాధారణంగా గుండె పోటు ప్రమాదం వచ్చే ముందు శరీరంలో కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని ముందుగానే పసిగట్టి జాగ్రత్తపడితే పెద్ద ప్రమాదం ఉండదు. అదే పట్టించుకోకపోతే మాత్రం ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. అసలు గుండెపోటు ప్రమాదాన్ని ముందుగానే చెప్పే సంకేతాలు ఎలా ఉంటాయంటే..

కనురెప్పల చుట్టూ ఈ లక్షణాలుంటే..

కొలెస్ట్రాల్ సహా సహజ కొవ్వులు కనురెప్పల చుట్టూ ఎలివేటెడ్ పసుపురంగులో చుట్టినట్టుగా ఉంటుంది. ఇది కంటి చుట్టూ వలయంలా ఏర్పడుతుంది. దీనిని శాంథెలాస్మా అని పిలుస్తారు. శాంథెలాస్మా అంటే రక్తంలో అసాధారణమైన లిపిడ్ స్థాయిలతో సంబంధం కలిగి ఉంటుంది. దీనిని డెస్లిపిడెమియా అని అంటారు. అంటే ధమనుల గోడలపై కొలెస్ట్రాల్ పేరుకుని ఉండే విధానం. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాధాన్ని పెంచుతుంది. ముఖం మీద కొలెస్ట్రాల్ కార్నియల్ ఆర్కస్‌తో బాధపడే వారిలో కంటి రంగు మసకబారి, తెలుపు, బూడిద, నీలం రంగులో కార్నియా అంచులు కనిపిస్తాయి.

ఛాతినొప్పి..

1. ఛాతీ మధ్యలో ఎడమవైపున అసౌకర్యంగా ఉంటుంది. ఒత్తిడి, పిండేస్తున్నట్టుగా నొప్పి కలుగుతుంది. ఈ నొప్పి చిన్నగా మొదలై తీవ్రంగా మారవచ్చు.

2. మెడ, చేతులు, దవడ, వీపు, కడుపు భాగాలలో మంట, అసౌకర్యం ఉంటుంది.

3. శ్వాస ఆడకపోవడం.

4. కాంతిని చూడలేకపోవడం.

5. వికారం, వాంతులు

6. శరీరం అంతా చెమట వంటి లక్షణాలుంటాయి.


Health Tips : జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తింటే చాలట.. !

ఎటువంటి కారణం లేకుండానే తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. మాటలో స్పష్టత ఉండదు. గందరగోళంగా, మాట్లాడటం చేస్తారు. ముఖం, చేయి, కాలు తిమ్మిరిగా అనిపిస్తాయి.

నడకలో ఇబ్బంది, మైకం, కళ్లు బలహీనంగా, దృష్టి మసకగా ఉంటుంది. గుండెకు రక్త ప్రసరణ చేసే రక్త నాళాల్లో ఒక దానిలో కొవ్వు పేరుకోవడం వల్ల ప్లేక్ తయారయ్యి నొప్పి మొదలవుతుంది. ఈ పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది.

Hair care : వెంట్రుకలు పెళుసుగా ఉంటే పెరుగు మాస్క్ వేయండి.. సరిపోతుంది..!

గుండె కొట్టుకునే వ్యవస్థలో ఇబ్బంది కలిగితే కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. దానితో క్షణాల్లో గుండె ఆగిపోయి, మరణంచే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో క్షణాల్లో స్పందించి సీపీఆర్ చేస్తే ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Aug 05 , 2024 | 11:41 AM

Advertising
Advertising
<