Human brain : మానవ మెదడు గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా..!
ABN, Publish Date - Jul 23 , 2024 | 11:56 AM
గట్టిగా ఆలోచిస్తే, మెదడు రక్తం నుంచి ఆక్సిజన్, ఇంధనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంది. దాదాపు 50 శాతం వరకూ ఉపయోగిస్తుంది.
గొప్ప మేధావులు, అతి విజ్ఞానులు అంతా మెదడు పనితీరుతోనే గొప్పవారుగా గుర్తింపబడ్డారు. మెదడు ఆలోచనా తీరు, పనిచేసే విధానాన్ని బట్టి వారిని గొప్పవారుగా, తెలివైన వారుగా గుర్తిస్తాము. మెదడు ఆలోచనలు పదునుగా ఉండటానికి దాని పనితీరే కారణం. మానవ మెదడులో ఎన్నో విచిత్రాలు, అన్నో అద్భుతాలు సృష్టించగల శక్తి, సామర్థ్యాం ఉన్నాయి. ఈ సున్నితమైన అవయవం, శరీరంలో అనేక విధులను బాధ్యతగా చేస్తుంది. మన మెదడు పనిచేసే విధానం గురించి, మెదడు విశేషాలను గురించి తెలుసుకుందాం.
1. సగటు మానవ మెదడు మూడు పౌండ్ల వరకూ బరువు ఉంటుంది. ఇది చూడడానికి గట్టి జెల్లీ లాంటి ఆకృతితో ఉంటుంది.
2. గుండె కొట్టుకనే ప్రతిసారీ, ధమనులు రక్తాన్ని 20 నుంచి 25 శాతం మెదడుకు తీసుకువెళతాయి.
3. జ్ఞాపకశక్తికి పదును పెట్టి ఏదైనా విషయాన్ని గుర్తు చేసుకున్న ప్రతి ఆలోచనకు మెదడు ఒక కనెక్షన్ని సృష్టిస్తుంది.
4. మెదడులో 100 బిలియన్ న్యూరాన్లు ఉన్నాయి. కానీ న్యూరాన్లు 100 ట్రిలియన్ ప్లస్ ట్రిగ్గర్ పాయింట్ల వరకూ విస్తరించి ఉంటాయి. ఈ న్యూరాన్లను నిపుణులు న్యూరాన్ ఫారెస్ట్ అనిపిలుస్తారు.
5. మెదడులో పరిమాణం పట్టింపులేదు. చిన్న మెదడు కంటే పెద్ద మెదడు తెలివైనదని ఆధారం లేదు.
Women Health : మహిళలు ఎందుకు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి..!
6. మెదడులో 100,000 మైళ్ల రక్తనాళాలున్నాయి. భూమధ్య రేఖ వద్ద ప్రపంచవ్యాప్తంగా దూరం 24,900మైళ్ళు.
7. మెదడు విశ్రాంతిగా ఉన్న సమయంలో పగటి కలలు కనడం, ఆలోచనతో సంబంధం లేకపోవడం వంటివి, నియంత్రించే మెదడులోని భాగాలు దాదాపు ఎప్పుడూ చురుకుగా ఉంటాయి.
Milk Time : పాలను ఏ సమయంలో తీసుకోవాలి.. !
8. పెద్దగా ఆలోచిస్తే, మెదడు రక్తం నుంచి ఆక్సిజన్, ఇంధనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంది. దాదాపు 50 శాతం వరకూ ఉపయోగిస్తుంది.
9. మెదడు సమాచారం గంటకు 350 మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. ఒక న్యూరాన్ ప్రేరేపించబడినప్పుడు, అది సెల్ నుండి సెల్‌కు ప్రయాణించే విద్యుత్ ప్రేరణను ఉత్పత్తి చేస్తుంది.
10. శరీరం, మెదడు మధ్య కమ్యూనికేషన్ ప్రధాన మూలం వెన్నుపాము. సగటున, వెన్నుపాము 4 సంవత్సరాల వయస్సులో పెరగడం ఆగిపోతుంది. వెన్నుపాము మెదడు నుండి శరీరం అంతటా సందేశాలను పంపడానికి బాధ్యత వహించే నాడీ కణజాలం, సహాయక కణాల కట్టను కలిగి ఉంటుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 23 , 2024 | 11:56 AM