Health Tips : నిద్ర పక్షవాతం గురించి ఈ విషయాలు తెలుసా...!
ABN, Publish Date - Aug 09 , 2024 | 03:51 PM
ప్రతి 100 మందిలో 8 మందికి ఏదో ఒక దశలో నిద్ర పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి మాత్రమే జరగవచ్చు, లేదా తరచుగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ పక్షవాతం కౌమారదశ నుంచి మొదలవుతుంది.
స్లీప్ పెరాలసిస్ (Sleep paralysis) నిద్రలోనే పక్షవాతం ఈ పరిస్థితిలో నిద్రపోతున్నప్పుడు, మేల్కొన్నా, కదలడానికి, మాట్లాడలేని స్థితి. ఈ అనారోగ్యం కలిగిన మనుషులు స్పృహలోనే ఉన్నా కదలలేరు. ఈ స్లీప్ పెరాలసిస్ ని, రాపిడ్ ఐ మూమెంట్ అంటారు. పక్షవాతం వచ్చే సమయంలో మాట్లాలేరు, ఒత్తడి, ఉక్కిరిబిక్కిరి కావడం, భ్రాంతులు కలుగుతాయి. నార్కోలెప్సీ అనే నిద్ర రుగ్మతతో నిద్ర పక్షవాతం వస్తుంది.
ప్రతి 100 మందిలో 8 మందికి ఏదో ఒక దశలో నిద్ర పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి మాత్రమే జరగవచ్చు, లేదా తరచుగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ పక్షవాతం కౌమారదశ నుంచి మొదలు కావచ్చు. ఒకసారి ఈ పక్షవాతం వచ్చివ వారికి 20 నుంచి 40 సంవత్సరాల మధ్య తరచుగా వస్తూ ఉంటుంది.
ఇది ఎటువంటి శరీరక హాని కలిగించదు కానీ కదలలేని పరిస్థితి కారణంగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రాపిడల్ మూవ్ మెంట్లో శరీరం తాత్కాలికంగా పక్షవాతానికి గురవుతుంది. నిద్రలో ఉండటం కారణంగా ముందుగానే తెలుసుకుని అప్రమత్తం కావడానికి కూడా అవకాశం ఉండదు.
Weight Loss : ఈ దోశతో బరువు ఇట్టే తగ్గొచ్చు.. ఎలా తయారు చేయాలంటే..!
నిద్ర పక్షవాతం అనేక రకాల లక్షణాలతో ఉంటుంది. ఇది యుక్తవయసులో ప్రారంభం అయితే 20 నుంచి 40 ఏళ్ళలో మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
1. కదలలేకపోవడం, మాట్లాడలేకపోవడం, అటోనియా లక్షణాలు ఉంటాయి.
2. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది.
Festival Time : హరియాలీ తీజ్ వేడుకల్లో ఖీర్ ఎందుకు చేస్తారు?
3. భ్రాంతులు, లేని వస్తువు ఉన్నట్టుగా అనిపిస్తుంది.
4. ఛాతీలో ఒత్తిడి
5. దాదాపు 37 శాతం రోగుల్లో ఈ లక్షణాలు ఉంటాయి. తరచుగా, రకరకాల దృశ్యాలు కనిపించడం, ముఖాలు, ఆకారాలు, కాలిడోస్కోపిక్ నమూనాలుగా కనిపిస్తాయి. శబ్దాలు వినడం, సంభాషణలు విపిస్తున్నట్లుగా అనిపిస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Aug 09 , 2024 | 03:51 PM