Health Tips : నాలుక రంగుమారితే అది దేనికి సంకేతం.. శరీరంలోని రుగ్మతల గురించి నాలుక చెప్పేస్తుందా..!
ABN, Publish Date - Jun 18 , 2024 | 04:15 PM
అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యుడిని దగ్గరకు వెళితే డాక్టర్ నాలుక చెక్ చేస్తాడు. ఇది మన ఆరోగ్య స్థితిని చెబుతుంది. నాలుక మారుతున్న రంగును గమనించడం అవసరం. నాలుక రంగు వివిధ రోగాలకు సంకేతం అని చెప్పచ్చు.
ఏదైనా వ్యాధి సోకిందని డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే టెంపరేచర్తో పాటు బీపీ చెక్ చేసి చివరిలో నాలుక చూపించమంటారు దేనికో మనలో కొందరికి తెలియకపోవచ్చు. నాలుక మన ఆరోగ్యం గురించి చెబుతుంది. ఇలా నాలుక చూసి మన ఆరోగ్యం సంగతి డాక్టర్ ఇట్టే కనిపెట్టేస్తారన్నమాట. అంతే కాదు కొన్ని తీవ్రమైన వ్యాధుల గురించి కూడా నాలుక రంగు మారి ముందుగానేచెప్పేస్తుందట. అదెలాగంటే..
అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యుడిని దగ్గరకు వెళితే డాక్టర్ నాలుక చెక్ చేస్తాడు. ఇది మన ఆరోగ్య స్థితిని చెబుతుంది. నాలుక మారుతున్న రంగును గమనించడం అవసరం. నాలుక రంగు వివిధ రోగాలకు సంకేతం అని చెప్పచ్చు.
ఒక వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉన్నట్టు చెప్పాలంటే అతని నాలుక ఎరుపు గులాబీ రంగులో ఉంటుంది. అదే సన్నని తెల్లని పూత కూడా ఉంటుంది. నాలుక రంగులోనూ పై పూతలోనూ మార్పులు కనిపిస్తే మాత్రం అది లోపలి ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది.
నాలుక గులాబీ రంగులో కాకుండా ఏదైనా వేరే రంగులో కనిపిస్తే మాత్రం..
Viral Video : ఫొటోగ్రాఫర్ కెమెరాకు చిక్కిన టైగర్ పంజా .. !
నలుపు రంగు.. నాలుక నలుపు రంగులో ఉంటే క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన ప్రాణాంతక సమస్య ఉన్నట్టు సంకేతం. నలుపు రంగు నాలుక ఫంగస్స అల్సర్ వంటి వ్యాధుల వల్ల కూడా నలుపు రంగులోకి మారుతుంది.
తెలుపు రంగు.. నాలుక తెలుపు రంగులోకి మారి నట్లయితే అది డీహైడ్రేషన్ అవకాశాలు పెరిగినట్టు చెబుతుంది. తెల్లటి నాలుక ల్యూకోప్లాకియా వంటి తీవ్రమైన వ్యాధికి కారణం కావచ్చు.
పసుపు రంగు నాలుక..ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంపై దృష్టిపెట్టాలని చెబుతుంది. నోటిలో మిగిలిపోయిన బ్యాక్టీరియా కారణంగా నాలుక రంగు పసుపుగా మారుతుంది.
Drink Milk Tea : రోజూ పాలతో చేసిన టీ తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు ఉంటాయి..!
ఎరుపు రంగు.. నాలుక ఎరుపు రంగులోకి మారితే విటమిన్ బి, ఇనుము, లోపాన్ని చెబుతుంది.. ఈ రంగు నాలుక ఫ్లూ, జ్వరం, ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలను చెబుతుంది.
అందువల్ల నాలుక రంగు మారడాన్ని గమనించినట్లయితే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం మంచిది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jun 18 , 2024 | 04:15 PM