Tooth Paste : టూత్ పేస్ట్‌కి కలర్ కోడ్ ఉంటుందా.. వెనుక ఉన్న కలర్స్ దేనికి సంకేతం.. !!
ABN, Publish Date - Jul 19 , 2024 | 04:36 PM
సరైన నోటి పరిశుభ్రత లేకపోతే అంటువ్యాధులు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
టూత్ పేస్ట్ దంతాలను శుభ్రం చేయడంలో పేస్ట్ చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. రకరకాల రంగుల్లో, రుచుల్లో మంచి ఫ్లేవర్స్ తో ఉండే ఈ పేస్టులు ఎవరికి నచ్చిన బ్రాండ్ వాళ్ళు ఎంచుకుని సంవత్సరాల తరబడి అవే బ్రాండ్స్ వాడుతూ ఉంటారు. అయితే టూత్ పేస్ట్ ఇలాగే ఉండాలని, ఇదే రంగులో, ఆకారంలో ఉండాలనే కొలమానాలేం లేవు. ఏ బ్రాండ్ అయినా వారి నమూనాల ప్రకారం టూత్ పేస్ట్ తయారుచేస్తుంది. అయితే రోజుకో కొత్త వెరైటీ పుట్టుకొస్తూ ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటాయి. ఈ పేస్ట్ ఎంపిక చేసే వారు, వాడేవారికి దాని ప్రత్యేక రంగు విషయంలో ఈ విషయం మాత్రం అస్సలు తెలిసి ఉండదు. అదేమిటంటే..
నోటి పరిశుభ్రతలో రోజుకు కనీసం రెండుసార్లు పళ్ళు తోముకోవడం అవసరం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆహార కణాలను, ఫలకాలను తొలగించేందుకు పేస్ట్ చాలా సహకరిస్తుంది. ఈ కణాలు, ఫలకాలను తొలగించుకోవడం అవసరం. చిగుళ్ల వ్యాధి నుంచి కావిటీలను ఆపడానికి సహాయపడుతుంది. బ్రష్ చేయడం వల్ల నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది. నోటిలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది.
Sleeping Health : సరైన నిద్రకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
సరైన నోటి పరిశుభ్రత లేకపోతే అంటువ్యాధులు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం మంచిది. నోరు శుభ్రంగా ఉండటం మనమీద మనకు నమ్మకాన్ని పెంచుతుంది. పరిశుభ్రమైన పళ్లు ఆరోగ్యాన్ని పెంచుతాయనే మాట చిన్ననాటి నుంచే పిల్లల్లో కలిగించాలి. అయితే సరైన బ్రష్ ఎంచుకోవడం ఎంత ముఖ్యమో అలాగే సరైన పేస్ట్ ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం, టూత్ పేస్ట్ ఎంచుకోవడం సరే, ట్యూబ్లోని కలర్ కోడ్ లను గమనించారా.. దాని ప్రతిరంగూ దేనినిసూచిస్తుందో, లేదో తెలుసా..
ఈ రంగు దేనికి అర్థం..
టూత్ పేస్ట్ ట్యూబ్ దిగువన రంగు కోడ్ టూత్ పేస్ట్ తయారీలో పదార్ధాలు, లేదా నాణ్యతను సూచిస్తాయి. ఇది నిజం కాదు.. నిజానికి ఇవి ప్యాకేజీ కత్తిరించినపుడు ఏర్పడతాయి. తయారీలో భాగంగా ఏర్పడే రంగులు మాత్రమే. ప్యాకేజీని ఎక్కడ కత్తిరించాలో చెప్పేందుకు అందాజాగా పెట్టుకునే గుర్తు మాత్రమే ఇది. ఈ గుర్తులు పచ్చ , నీలం, ఎరుపు, నలుపు రంగులలో కనిపిస్తాయి. ఇవిసరిగ్గా టూత్ పేస్ట్ ట్యూబ్ చివరన కనిపిస్తాయి. నలుచదరంగా ఉంటాయి. ఈ గుర్తులు. వీటికీ టూత్ పేస్ట్ లో ఉపయోగించిన పదార్థాలకు అస్సలు సంబంధం లేదు.
Skin Health : క్లీన్ బ్యూటీ చర్మం కావాలంటే ఈ క్రీమ్స్ వాడి చూడండి..
టూత్ పేస్ట్ ఎలా ఎంచుకోవాలి..
టూత్ పేస్ట్ ఎంచుకునేటప్పుడు చూడాల్సింది కీలకమైన సమాచారం, ప్యాకేజింగ్ లోనే ఈ సమాచారం ఉంటుంది. ముఖ్యంగా పదార్థాల జాబితాను చూడాలి. తయారు చేసిన తేదీని, ఎప్పుడు తేదీ దాటిపోయేదీ చూడాలి. నోటి ఆరోగ్యానికి సరిపడా ఫ్లోరైడ్ కలిగి ఉందా అనేది కూడా చూడాలి. దంతక్షయాన్ని తగ్గించడానికి ఎంతవరకూ సహకరిస్తాయో తెలుసుకుంటే చాలు.
కొన్ని పేస్టులు సున్నితత్వం కలిగి, తెల్లబడటం, లేదా టార్టార్ నియంత్రణ వంటి నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా తయారు చేస్తారు.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 19 , 2024 | 04:36 PM