Healthy Sleep : ఈ చిట్కాలతో రాత్రిపూట మంచి నిద్ర ఖాయం.. ట్రై చేసి చూడండి..!
ABN, Publish Date - Apr 29 , 2024 | 04:40 PM
రాత్రి పూట తీసుకునే భోజనం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పెద్ద భోజనం రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల అది కూడా నిద్రకు భంగం కలిగిస్తుంది. జీర్ణం కాకుండా చికాకు తెప్పిస్తుంది. కాబట్టి రాత్రి తీసుకునే భోజనం లైట్ గా ఉండేలా చూసుకోవాలి.
నిద్ర సరిగా లేకపోతే రాత్రి మాత్రమే చికాకుగా ఉండటం కాదు. మరుసటి ఉదయం కూడా అదే చికాకు ఉంటుంది. ఏ పనీ చేయబుద్ధికాదు. నీరసం, అలసట, చికాకు, తలనొప్పి ఇలా ప్రతిదీ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. నిద్ర సరిగా పట్టకపోవడానికి చాలా కారణాలే ఉండవచ్చు కానీ. సరైన నిద్ర నిద్రపోవడానికి మాత్రం జీవన శైలి అలవాట్లు కూడా సరిగా ఉండాలి. సరైన సమయానికి రాత్రి భోజనం చేయడం, సరైన సమయానికి నిద్రపోవడం. పడుకునే ముందు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండటం, ఆలోచనలను పక్కన పెట్టి నిద్రపోవడం కావాలి. అలాగే స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, ఫోన్ చూసే అలవాటు మానుకోవడం కూడా మంచి నిద్రను ఇస్తాయి. అయితే నిద్ర మామూలుగా మనకు ఎంత సమయం అవసరం. కాస్త తగ్గించి నిద్రపోతే ఎలాంటి ఉబ్బందులు వస్తాయనే విషయాన్ని తెలుసుకుందాం.
మంచి నిద్ర కావాలంటే ఏం చేయాలి..
పని ఒత్తిడి కారణంగా ఉదయం నుంచి రాత్రి వరకూ అదే ఆలోచన నడుస్తూ ఉంటుంది. దీనితో చేసే పని, తినే తిండే కాదు నిద్ర కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆఫీస్ నుంచి రాగేనే ఇంట్లో పని చక్కబెట్టేసి, ఇక ఆఫీస్ ఆలోచనల వైపుకు పోకపోవడమే మంచిది. దీనికి బదులు మంచి పుస్తకం చదివే అలవాటును చేసుకోండి. లేదంటే ప్రియమైన వారితో మీ సమయాన్ని గడిపేందుకు చూడండి.
వేసవిలో మారేడు జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా.. ?
తినే భోజనం..
రాత్రి పూట తీసుకునే భోజనం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పెద్ద భోజనం రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల అది కూడా నిద్రకు భంగం కలిగిస్తుంది. జీర్ణం కాకుండా చికాకు తెప్పిస్తుంది. కాబట్టి రాత్రి తీసుకునే భోజనం లైట్ గా ఉండేలా చూసుకోవాలి.
Healthy Food : బియ్యానికి బదులుగా గోధుమ రవ్వను తీసుకుంటే..!
కెఫిన్, ఆల్కహాల్ దూరం పెట్టండి.
రాత్రి సమయాల్లో ఆల్కహాల్ తీసుకోవడం కూడా అర్థరాత్రి వరకూ నిద్రలేకుండా చేస్తుంది. కెఫీన్, ఆల్కహాల్ ప్రభావాలు శరీరం నుంచి పోవడానికి 10 గంటల సమయం పడుతుంది. ఈ అలవాట్ల కారణంగా నిద్ర మాత్రమే కాకుండా మొత్తం శరీరం ఎఫెక్ట్ కావచ్చు. ఈ అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.
స్క్రీన్ టైం తగ్గించండి.
రాత్రి సమయాల్లో నిద్ర పోవడానికి ముందు స్క్రీన్ చూడటం వల్ల బ్లూ రే కిరణాలు కంటిని ఎఫెక్ట్ చేస్తాయి. ఇవి నిద్రకు భంగం కలిగిస్తాయి. నిద్రపోవడానికి రెండుగంటల ముందే ఫోన్, టీవి వంటివి చూడకపోవడం మంచిది. రోజుకు కనీసం 8 నుంచి 9 గంటల నిద్ర ప్రతి ఒక్కరికీ అవసరం. ఇది మొత్తం ఆరోగ్యాన్ని పెంచుతుంది.
Read Latest Navya News and Thelugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Apr 29 , 2024 | 04:41 PM