Health Tips : జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తింటే చాలట.. !
ABN, Publish Date - Aug 01 , 2024 | 02:52 PM
ఫైబర్ స్పాంజ్‌లాగా పనిచేస్తుంది. ఇది నీటిని పీల్చుకుంటుంది. ద్రవం లేకుండా, ఫైబర్ తీసుకుంటే మలబద్దకం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఎక్కువగా నీటిని త్రాగుతూ ఉండాలి.
అసిడిటీ, అజీర్ణం, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. మలబద్దకం, అజీర్ణం సమస్య ఉన్నవారు సరైన ఆహారాన్ని ఎంపిక చేసుకుని తినడం చాలా ముఖ్యం. శరీరంలో జీర్ణవ్యవస్థ ముఖ్యపాత్ర పోషిస్తుంది. శరీరానికి అవసరమైన శక్తిని అవసరమైన పోషకాలను అందిస్తుంది. మనం రోజూ తీసుకునే ఆహారంలో ఈ పదార్ధాలను తీసుకుంటే అజీర్ణం, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీనికి..
రోజులో 30 గ్రాముల ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆరోగ్యకరమైన ఫైబర్ ఆహారాలలో..
బ్రౌన్ రైస్
పండ్లు, కూరగాయలు
ఓట్స్
బీన్స్
గోధుమ రొట్టే
కొందరిలో తృణధాన్యాలు కూడా కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తాయి. ఇలాంటి వారు పండ్లు, కూరగాయలు తీసుకుంటూ ఉండాలి. ఫైబర్ స్పాంజ్‌లాగా పనిచేస్తుంది. నీటిని పీల్చుకుంటుంది. ద్రవం లేకుండా, ఫైబర్ తీసుకుంటే మలబద్దకం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఎక్కువగా నీటిని త్రాగుతూ ఉండాలి. అజీర్ణం, ఉబ్బరం సమస్యలు ఉన్నవారు మసాలా ఆహారాన్ని తీసుకోకూడదు. కొందరు స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు ఉంటాయి.
Hair care : వెంట్రుకలు పెళుసుగా ఉంటే పెరుగు మాస్క్ వేయండి.. సరిపోతుంది..!
మెంతులు..
మెంతులలో జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తాయి. శరీరంలోని హానికరమైన పదార్థాలను తొలగించడంలో ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయి. రోజూ ఖాళీ కడుపుతో మెంతి నీరు త్రాగితే జీర్ణవ్యవస్థ సజావుగా సాగుతుంది. పొట్టలో కొవ్వు కూడా తగ్గుతుంది.
పసుపు..
పసుపులో అనేక ఔషధ గుణాలున్నాయి. పసుపు ఆహారానికి రంగు మార్చడంలో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలున్నాయి. జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ ఒక గ్లాసు నీటిలో చిటికెడు పసుపు వేసి, త్రాగాలి.
Health Tips : ఈ జాగ్రత్తలు తీసుకుంటే మెడనొప్పి ఇబ్బంది ఉండదు..!
అల్లం..
అల్లంలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలున్నాయి. ఇందుకోసం అల్లం రసాన్ని మరిగించి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
సబ్జా గింజలు..
సబ్జా గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
Health Tips : కాల్చిన అల్లం, తేనెతో జలుబు, గొంతు నొప్పికి చెక్ పెట్టండిలా... !
బొప్పాయి..
జీర్ణ సమస్యలు, అజీర్ణం, గ్యాస్ ఇబ్బందులు ఉన్నవారు బొప్పాయి తీసుకుంటే అందులోని ఫైబర్, ప్రోటీన్ జీర్ణవ్యవస్థను మెరుగు పరిచేందుకు సహకరిస్తాయి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Aug 01 , 2024 | 02:52 PM