This Summer : ఈ వేసవిలో వ్యాధులకు నో చెప్పండి.. ముఖ్యంగా డయేరియా వచ్చే అవకాశాన్ని ఇలా తప్పించుకోండి.
ABN, Publish Date - Apr 17 , 2024 | 02:11 PM
వేసవి వచ్చిందంటే తిండి సరిగా తినాలనిపించదు. ఒకటే ఇబ్బంది ఏ పదార్థం తిన్నా.. దాహంగా అనిపిస్తుంది. అధికంగా నీరు తాగడం, తిన్నది అరగకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు బయట పదార్థాలను తినడం వల్ల కూడా జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు కలుగుతాయి.
వేసవి వచ్చిందంటే తిండి సరిగా తినాలనిపించదు. ఒకటే ఇబ్బంది ఏ పదార్థం తిన్నా.. దాహంగా అనిపిస్తుంది. అధికంగా నీరు తాగడం, తిన్నది అరగకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు బయట పదార్థాలను తినడం వల్ల కూడా జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు కలుగుతాయి. కడుపు ఇబ్బందులలో ముఖ్యంగా కడుపు నొప్పి, తిన్న పదార్థాలు అరగకపోవడం, విరేచనాలు వంటివి అధికంగా ఇలా ఉన్నప్పుడు రోజుకు నాలుగైదు సార్లు ఉప్పు, పంచదార కలిపిన నీరు తాగాలి. పాలు కలపని సగ్గు బియ్యం జావ తీసుకుంటూ ఉండాలి.
టైఫాయిడ్ జ్వరం
ఇది నీటి ద్వారా సంక్రమించే వ్యాధి, ఇది కలుషితమైన ఆహారం, నీటి ద్వారా ఇది వ్యాపిస్తుంది. బాక్టీరియం, సాల్మొనెల్లా టైఫీ వల్ల వస్తుంది. వేడి తేమతో కూడిన వాతావరణంలో, అపరిశుభ్రంగా నిల్వ చేయబడిన ఆహారం, నీటి వనరులలో వ్యాధి పెరుగుతుంది.
అతిసారం,విరేచనాలు..
నీటి మలం, నిర్జలీకరణం, కడుపునొప్పి అన్నీ కలిసి వచ్చి అలసిపోయి బలహీనంగా మారేలా చేస్తాయి. దీనికి వివిధ బ్యాక్టీరియా, వైరస్ కలుషిత ఆహారం, నీరు కారణం.
Light colors in summer : వేసవిలో లేత రంగులు ఎందుకు.. వీటితో వేడి నుంచి తప్పించుకోవచ్చా..!!
మీజిల్స్, చికెన్ పాక్స్..
వేడి, తేమతో కూడిన వాతావరణం వివిధ చర్మపు దద్దుర్లు వస్తాయి.. ఎక్కువగా పిల్లలు ఈ వైరల్ ఇన్ఫెక్షన్లకు గురవుతారు, ఇది జ్వరం, ఇతర లక్షణాలతో కూడిన చిన్న ద్రవంతో నిండిన దద్దుర్ల రూపంలో కనిపిస్తుంది.
వడ దెబ్బ
వాతావరణం మారి అధిక ఉష్ణోగ్రత, పొడివేడి గాలి, సూర్యరశ్మికి గురికావడం హీట్ స్ట్రోక్‌కు దారి తీస్తుంది. ఇది అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు శరీరం ఉష్ణోగ్రత కారణంగా అధిక జ్వరం, నీరసం ఉంటాయి.
Sleep disorder : నిద్రలేకపోవడం వల్ల కలిగే వ్యాధులు, ఆరోగ్య సమస్యలు..
నివారణ
వేసవి వేడిని తట్టుకునే విధంగా జ్యూస్ లు, మజ్జిగ, చల్లని పదార్థాలను తీసుకోవాలి.
వేడి తగలని ప్రదేశాల్లో ఉండి శరీరాన్ని కాటన్ దుస్తులు ధరించాలి.
తీసుకునే ఆహారం తాజాగా, వేడిగా ఉండేలా చూసుకోవాలి. నిల్వ ఆహారాన్ని తీసుకోరాదు.
స్వచ్ఛమైన నీటిని మాత్రమే తాగాలి. ఎండవేళలో బయటకు వెళ్లకపోవడం మంచిది. బయటి ఆహారాలను తీసుకోరాదు.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Apr 17 , 2024 | 02:11 PM