Health Tips : మనం తినే ఆహారాన్ని ఎన్నిసార్లు నమిలి తినాలి? దీనితో కలిగే ప్రయోజనాలేంటి..!
ABN, Publish Date - Jun 19 , 2024 | 04:17 PM
32 సార్లు నమిలి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుగా ఉంటుంది. ఆహారాన్ని సరిగ్గా నమిలి తినడం వల్ల రుచులు విడుదలవుతాయి. కార్బోహైడ్రేట్లు జీర్ణం చేస్తాయి. ప్రతి ఒక్కరూ నమిలి తినడం ఆహారాన్ని తీసుకోవడంలో పాటించే సరైన పద్దతి
ఆకలి వేయగానే తినడం కడుపు నిండగానే తినడం ఆపేయడం ఇదే మనకు తెలిసిన అంచనా. అలాగే మళ్ళీ ఆకలి వేస్తే మళ్లీ తింటూ ఉంటాం. అంతేకానీ తినే పదార్థాన్ని ఎన్నిసార్లు నమిలి తినాలనేది ఆలోచించం. మనకు ఉన్న పని తొందర వల్లనో, మనకున్న ఒత్తిడి కారణంగానో గబ గబా తినేసి తినేసాం అనిపిస్తాం. కానీ లోపలికి వెళ్లిన ఆహారం సరిగా నమలకపోవడం వల్ల కడుపు నొప్పులు, జీర్ణం కాకపోవడం వంటి సమస్యలుంటాయి. ఆహారాన్ని నమలడం అనేది జీర్ణక్రియను సజావుగా చేస్తుంది. పెద్ద పెద్ద ముద్దలుగా తినడం, పెద్ద ముక్కలను నమలకుండా మింగేయడం కారణంగా జీర్ణ క్రియ ఇబ్బందులు తలెత్తుతాయి. అసలు తిన్న ఆహారాన్ని ఎన్నిసార్లు నమిలి తినాలి అదే తెలుసుకుందాం.
ఆహారం త్వరగా తినేయాలనే తొందర తప్ప, ఓ ముద్దను ఆహారాన్ని 32 సార్లు నమిలి తీనాలి. ఇలా తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని మన పెద్దలు చెప్పారు. ఆహారాన్ని 32 సార్లు నమలడం అంటేమనం నిండినట్లుగా వచ్చే సంకేతాలు అందుకోవడానికి మెదడుకు తగినంత సమయం ఇస్తుంది. అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.
32 సార్లు నమిలి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుగా ఉంటుంది. ఆహారాన్ని సరిగ్గా నమిలి తినడం వల్ల రుచులు విడుదలవుతాయి. కార్బోహైడ్రేట్లు జీర్ణం చేస్తాయి. ప్రతి ఒక్కరూ నమిలి తినడం ఆహారాన్ని తీసుకోవడంలో పాటించే సరైన పద్దతి.
Health Tips : శరీరాన్ని ఆరోగ్యంగా, దృఢంగా మర్చేసే దీని గురించి తెలుసా.. ఒక్క స్పూన్ తింటే చాలు..!
దీనివల్ల ప్రయోజనాలు..
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారాన్ని మనిలితే అది చిన్న ముక్కలుగా విరిగిపోతుంది. కడుపులో జీర్ణక్రియ ప్రక్రియకు సహాయపడుతుంది.
విటమిన్లు, ఖనిజాలు ఆహారాన్ని నమలడం ద్వారా అందులోని పోషకాలు శరీరానికి పుష్కలంగా అందుతాయి.
బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. బాగా నమిలి తినడం కారణంగా బరువు నియంత్రణలో ఉంటుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jun 19 , 2024 | 04:17 PM