Tooth Brushes : మనం వాడే టూత్ బ్రష్‌ను ఎంత కాలానికి మార్చాలి..!
ABN, Publish Date - Jul 08 , 2024 | 03:40 PM
జలుబు, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి అంటువ్యాధుల నుంచి కోలుకున్న తర్వాత అదే టూత్ బ్రష్ వాడకూడదు. దానిని మార్చడం చాలా ముఖ్యం. బాక్టీరియా, వైరస్లు టూత్ బ్రష్ ముళ్ళపై ఉంటాయి.
దంతాలను శుభ్రం చేసుకోవడానికి మనం అంతా వాడే టూత్ బ్రష్ ఎన్ని రోజులకు మార్చాలి. ఈ విషయంలో సరైన అవగాహన ఎవరికీ అంతగా ఉండదు. అసలు టూత్ బ్రష్ ఎప్పుడు మార్చాలి. రోజూ బ్రష్ చేయడం వలన టూత్ బ్రష్ కుంచెలు అరిగిపోతాయి. ఈ బ్రష్ దంతాలను శుభ్రపరచడం తగ్గిస్తుంది. దీనితో బ్యాక్టీరియా పేరుకుంటుంది. సరైన టూత్ బ్రష్ ను ఎలా ఎంచుకోవాలి. అసలు ఎప్పుడు మార్చాలి. ఇదే తెలుసుకుందాం.
టూత్ బ్రష్ నోటి శుభ్రతను కాపాడేందుకు ఉపయోగించే సాధనం. చాలా మంది అదే టూత్ బ్రష్ ను చాలా కాలం పాటు మార్చకుండా వాడుతూనే ఉంటారు. అది ఇది అనేక నోటి ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. అయితే
నోటి పరిశుభ్రత చేసే బ్రష్ రీప్లేస్ మెంట్ ఎప్పుడు. టూత్ బ్రష్ ను ప్రతి మూడు నుండి నాలుగు నెలలకు మార్చడం అనేది నిజమేనా..మూడు నాలుగు నెలలకు ఒకసారి అలాగే ఏదైనా అనారోగ్యం పాలైన తర్వాత మళ్ళీ అదే బ్రష్ వాడకూడదు. దీనిని మారుస్తూ ఉండాలి.
Monsoons Tips : వర్షాకాలంలో ఈ ఔషధాలను తీసుకోవాల్సిందే.. వీటితో..!
టూత్ బ్రష్ కాలానికి తగినట్టుగా ప్రతి మూడు నెలలకూ మార్చడం వల్ల చాలా నోటి అలర్జీల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే దంతాల దృఢత్వం కూడా బావుంటుంది.
బ్రిస్టల్స్ పూర్తిగా అరిగిపోయే వరకూ అదే వాడకూడదు..
మంచి నోటి పరిశుభ్రత కోసం నోటి ఆరోగ్య సమస్యలను నివారించడానికి టూత్ బ్రష్ క్రమం తప్పకుండా మార్చాలి. వంగిన, విరిగిన బ్రిస్టల్స్ తో దంతాలను శుభ్రపరచడం మంచిది కాదు. ఇది బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది. పాచి పేరుకునేలా చేస్తుంది. కనుక సరైన బ్రిస్టల్స్ ఉన్న బ్రష్ ఎంచుకోవాలి.
ఏ అనారోగ్యాల తర్వాత బ్రష్ మార్చాలి..
జలుబు, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి అంటువ్యాధుల నుంచి కోలుకున్న తర్వాత అదే టూత్ బ్రష్ వాడకూడదు. దానిని మార్చడం చాలా ముఖ్యం. బాక్టీరియా, వైరస్లు టూత్ బ్రష్ ముళ్ళపై ఉంటాయి. ఇవి తిరిగి ఇన్ఫెక్షన్ కు గురయ్యేలా చేయవచ్చు. జబ్బు పడిన తర్వాత టూత్ బ్రష్ మార్చడం వల్ల సూక్ష్మ క్రిముల వ్యాప్తిని తగ్గించవచ్చు. దీనితో నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Skin Brightens : పసుపు నీటితో ముఖాన్ని కడిగితే చాలు.. ముఖం మెరిసిపోవడం ఖాయం...!
ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఎప్పుడు మార్చాలి.
ఎలక్టిక్ టూత్ బ్రష్ ఉపయోగిస్తుంటే మాత్రం ప్రతి రెండు నుండి మూడు నెలలకు ఒకసారి బ్రష్ హెడ్ మారుస్తూ ఉండాలి. బ్రషింగ్ సమయంలో అధిక వేగవంతంగా కదులుతుంది కాబట్టి మాన్యువల్ టూత్ బ్రష్ కంటే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ హెడ్ ముందుగానే మారుస్తూ ఉండాలి.
దంత చికిత్స తర్వాత..
ఏదైనా ఇన్ఫెక్షన్ తర్వాత లేదా కొత్త దంతాల అమరిక కోసం చికిత్స చేయించుకుంటే మాత్రం వెంటనే అనువైన బ్రష్ ఎంచుకోవాలి. ఇది నోటి ఆరోగ్యాన్ని పెంచుతుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 08 , 2024 | 03:40 PM