Health Tips : పిల్లల్లో మైగ్రేన్ తలనొప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ట్రిక్స్ పాటిస్తే సరి..!
ABN, Publish Date - Sep 10 , 2024 | 11:25 AM
మైగ్రేన్ నొప్పులు కారణంగా కంటి సమస్యలు, నొప్పులు ఉంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలి. ఒత్తిడి కారణంగా మైగ్రేన్ వస్తున్నట్లయితే లోతైన శ్వాస తీసుకోవడం, మైండ్ ఫుల్ నెస్ వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి.
మైగ్రేన్ అనేది ఒక రకమైన తలనొప్పి, ఇది మళ్లీ మళ్లీ వస్తూ ఉంటుంది. తలపై ఒకటి లేదా రెండు వైపులా ఉంటుంది. మైగ్రేన్ ఉన్నవారిలో తల తిరగడం, కాంతి, శబ్దం, వాసన వంటి లక్షణాలు సున్నితంగా ఉంటాయి. మెదడులో కొన్ని న్యూరాన్లు సరిగా పనిచేయకపోవడం, నొప్పిని నియంత్రించే నాడీ వ్యవస్థను ప్రభావితం చేయడం వల్ల మైగ్రేన్ నొప్పి వస్తూ ఉంటుంది. అయితే చదువుకునే పిల్లల్లో మైగ్రేన్ సమస్య ఉన్నట్లయితే దీనికి అనేక కారణాలుంటాయి.
చదువుకునే పిల్లల్లో జీవనశైలి అలవాట్లు సరిగా లేకపోవడం, విపరీతంగా సోషల్ మీడియాకు అలవాటు పడటం, సెల్ ఫోన్, కంప్యూటర్లు ఎక్కువగా ఉపయోగించడం, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తీసుకోవడం, నిద్ర సమయాలు పాటించకపోవడం వంటివి తీవ్రమైన తలనొప్పులు, మైగ్రేన్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. ముఖ్యంగా చదువుల ఒత్తిడి కారణంగా పిల్లల్ని అనేక మానసిక, ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. దీనితో తలనొప్పులు, ఒత్తిడి, ఏకాగ్రత తగ్గడం, మానసిక స్థితి సరిగా లేకపోవడం, ఎదుగుదలను ప్రభావితం చేస్తుంది. చదువుల ఒత్తిడి వల్ల కలిగే మైగ్రేన్లు, తలనొప్పుల నుంచి పిల్లల్లో ఉపశమనం కలిగేందుకు ఈ చిట్కాలను పాటిస్తే సరి.
ట్రిగ్గర్స్ గుర్తించండి.
పిల్లల్ని ఇబ్బంది పెట్టే తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు ఉంటే, పెద్ద కాంతితో వెలిగే లైట్లు, పెద్ద పెద్ద శబ్దాలు, డీహైడ్రేషన్, ప్రాసెస్ చేసిన ఫుడ్, చాక్లెట్లు, స్నాక్స్ తీసుకోవడం కూడా ఈ సమస్యలను తెస్తాయి. ఈ సమస్య ఎక్కువగా ఉంటే మరీ కాంతి ఎక్కువగా ఉండే లైట్లకు దూరంగా ఉండాలి. తరగతి గది నుంచి బయటకు వచ్చాకా శబ్దాలను తగ్గించుకునే విధాలను పాటించాలి.
Foot Problems: పాదాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటే ఇలా చేయండి..!
హైడ్రేషన్..
డీహైడ్రేషన్ కారణంగా కూడా మైగ్రేన్ సమస్య ఉంటుంది. నీరు తాగేందుకు విరామాలు తీసుకోవడం క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి.
విశ్రాంతి తీసుకోవడం..
మైగ్రేన్ నొప్పులు కారణంగా కంటి సమస్యలు, నొప్పులు ఉంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలి. ఒత్తిడి కారణంగా మైగ్రేన్ వస్తున్నట్లయితే లోతైన శ్వాస తీసుకోవడం, మైండ్ ఫుల్ నెస్ వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది పిల్లల్లో చదువుల వల్ల కలిగే ఒత్తిడిని తగ్గిస్తుంది.
Health Tips : తల్లిపాలతో బిడ్డకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి..!
ఆరోగ్యకరమైన ఆహారం..
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ముఖ్యంగా మెగ్నీషియం అధికంగా ఉండే గింజలు, ఆకు కూరలు వంటి ఆహార పదార్థాలలో మైగ్రేన్ సమస్యను తగ్గించే గుణాలుంటాయి.
పిల్లల్లో వచ్చే తలనొప్పులను చిన్న చిన్న చిట్కాలను పాటించి తగ్గించుకోవచ్చు. పోషకాహారం తీసుకోవడం, సరైన జీవనశైలి అలవాట్లు పాటించడం, వ్యాయామాలు, ఆట సమయాలను పెంచడం, శారీరక శ్రమ కలిగి ఉండటం, ఒత్తిడి లేని చదువులు ఇవన్నీ ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉంచుతాయి.
Read LatestNavya NewsandTelugu News
గమనిక:పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Sep 10 , 2024 | 11:25 AM