Health Tips : క్యాన్సర్ ఉన్నవారు పర్పుల్ క్యాబేజీ తింటే ఇన్ని లాభాలా..!
ABN, Publish Date - Jul 29 , 2024 | 10:27 AM
పర్పుల్ క్యాబేజీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి చక్కని ఆహారం.
కాస్త కలర్ ఫుల్‌గా కనిపించే పదార్థాలంటే తినాలనే, ప్రత్యేక శ్రద్ధ అందరిలోనూ కనిపిస్తుంది. ఇవి కంటికి ఇంపుగా ఉండటమే కాదు. ఈ ఆహారంతో కలిగే ఆరోగ్యప్రయోజనాలు కూడా అదే లెవెల్లో ఉంటాయి. పర్పుల్ క్యాబేజీ ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలను సులభంగా పొందవచ్చు. ఈ క్యాబేజీలో ముఖ్యంగా ఫైటోకెమికల్స్, పోషకాలు, పీచుపదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్స్, థయామిన్, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, రైబోఫ్లావిన్, ఇనుము, పొటాషియం వంటి ఖనిజాలున్నాయి. మనం ఎప్పుడూ వంటకు ఉపయోగించే క్యాబేజీ లేత పచ్చ రంగులో చూసేందుకు అన్ని కూరగాయల్లానే ఉంటుంది. అయితే ఇందులోనే పర్పుల్ క్యాబేజీకి కొన్ని ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
పోషకాలు సమృద్ధిగా..
పర్పుల్ క్యాబేజీ విటమిన్లు ఎ, సి, కె, బి6 కలిగి ఉంటుంది. ఇందులో మాంగనీస్, కాల్షియం అధికంగా ఉంటాయి. డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది పూర్తి ఆరోగ్యానికి అనేక పోషకాలను అందిస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు కూడా ఎక్కువే..
పర్పుల్ క్యాబేజీలో యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్లు ఉన్నాయి. వీటి కారణంగానే క్యాబేజీ రంగు పర్పుల్ రంగులో ఉంటుంది. ఈ యాంటీఆక్సిడెంట్ల కారణంగానే శరీరానికి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షణ లభిస్తుంది.
రోగనిరోధక వ్యవస్థ..
పర్పుల్ క్యాబేజీలో అధికంగా విటమిన్ సి ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది శరీరంలో కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. మొక్కల ఆధారిత ఆహారాల నుంచి ఇనుమును గ్రహిస్తుంది.
Health Tips : ఎయిర్ పాడ్స్ వాడితే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా..!
క్యాన్సర్ తగ్గిస్తుందట..
ఇందులో ఇండోల్స్, ఆంథోసయనిన్లు వంటివి అధికంగా ఉన్నందున ఈ పర్పుల్ క్యాబేజీ క్యాన్సర్ నివారణకు ప్రధాన పాత్ర పోషిస్తుందని పరిశోధనల్లో తేలింది. మహిళల్లో కనిపించే రొమ్ము క్యాన్సర్‌కు పర్పుల్ క్యాబేజీ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయని ఈ పరిశోధనలు చెబుతున్నాయి.
గుండె ఆరోగ్యానికి బెస్ట్..
ఈ క్యాబేజీలోని ఆంథోసైనిన్లు, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు శరీరంలో రక్తపోటును తగ్గించడంలోనూ సహాయపడుతుంది.
Health Tips : పెద్దగా శ్రమలేకుండా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్‌లు తాగితే చాలు...!
జీర్ణక్రియకు సపోర్ట్..
పర్పుల్ క్యాబేజీలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను అందిస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధిని తగ్గించడంలో సహాయపడతాయి. ఎముకల ఆరోగ్యానికి కూడా ఈ క్యాబేజీలోని కె విటమిన్ సహకరిస్తుంది. ఎముకల్లో కాల్షియం పెంచడంలోనూ, బోలు ఎముకల వ్యాధిని నివారించడంలోనూ విటమిన్ కె చాలా అవసరం.
బరువు తగ్గాలను కుంటే..
పర్పుల్ క్యాబేజీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి చక్కని ఆహారం. ఈ క్యాబేజీని సలాడ్స్‌లో తీసుకోవడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్‌తో పాటు, బరువు ఇట్టే తగ్గేలా చేస్తుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 29 , 2024 | 11:11 AM