ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sleep Health : సరైన నిద్ర లేకపోతే, నిద్రమాత్రల జోలికిపోకుండా ఇలా చేయండి..!

ABN, Publish Date - Sep 10 , 2024 | 02:46 PM

ప్రశాంతమైన నిద్ర రోజును ఉత్సాహంగా మారుస్తుంది. రాత్రి నిద్రపోవడం కష్టంగా మారడం, తరచుగా నిద్ర నుంచి మేల్కొవడం నిద్రపోవడాన్ని కష్టంగా మారుస్తుంది. నిద్ర గురించి నిద్రమాత్రలు వాడుతుంటారు. నిద్ర సరిగా పట్టకపోవడం అనేది చిన్న సమస్య కాదు. బలవంతంగా నిద్రపోవడం మరిన్ని ఆరోగ్య సమస్యలను తెస్తుంది.

Sleep

ప్రశాంతమైన నిద్ర రోజును ఉత్సాహంగా మారుస్తుంది. రాత్రి నిద్రపోవడం కష్టంగా మారడం, తరచుగా నిద్ర నుంచి మేల్కొవడం నిద్రపోవడాన్ని కష్టంగా మారుస్తుంది. నిద్ర గురించి నిద్రమాత్రలు వాడుతుంటారు. నిద్ర సరిగా పట్టకపోవడం అనేది చిన్న సమస్య కాదు. బలవంతంగా నిద్రపోవడం మరిన్ని ఆరోగ్య సమస్యలను తెస్తుంది. ఒక్కరోజు సరిగా నిద్రలేకపోతే రోజంతా డల్‌గా అనిపిస్తుంది. నిద్రలేమి సమస్య వరుసగా ఉన్నట్లయితే మందులు కాకుండా వేరే మార్గాలను తెలుసుకుందాం.

నిద్రలేమికి కారణమయ్యే కారణాలు దాని రకాలను బట్టి మారుతూ ఉంటుంది.

తాత్కాలిక నిద్రలేమి.. ఒక నెల కంటే తక్కువ ఉంటుంది.

తీవ్రమైన నిద్రలేమి.. ఒకటి నుంచి ఆరు నెలల మధ్య ఉంటుంది.

దీర్ఘకాలిక నిద్రలేమి.. ఆరునెలల కంటే ఎక్కువ ఉంటుంది.

Foot Problems: పాదాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటే ఇలా చేయండి..!


నిద్రలేమికి కారణాలు ఏమిటి?

1. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నిద్రలేమికి కారణం అవుతాయి.

2. సరైన నిద్ర కోసం షెడ్యూల్ వేసుకోవాలి. ఆలస్యంగా నిద్రపోవడం, దిన చర్య సరిగా ఉండకపోవడం, పగటి పూట అతిగా నిద్రపోవడం నిద్ర చక్రానికి భంగం కలిగిస్తాయి.

3. దీర్ఘకాలిక నొప్పి, ఆస్తమా, కీళ్లనొప్పులు, అలర్జీలు, జీర్ణకోశ సమస్యలు, నరాల సంబంధిత రుగ్మతలు, హార్మోన్ల అసమతుల్యత వంటివి నిద్రకు అంతరాయం కలిగిస్తాయి.

4. అలర్జీలు, ఉబ్బసం, అధిక రక్తపోటు, నిరాశ, ADHD వంటి పరిస్థితులు, కొన్ని ప్రిస్క్రిప్షన్ మందులు నిద్రకు భంగం కలిగిస్తాయి.

Health Tips : తల్లిపాలతో బిడ్డకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి..!


5. కెఫిన్, నికోటిన్, ఆల్కహాల్.. వంటివి ఇందులో ఉండే ఉత్ప్రేరకాల కారణంగా నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతుంది.

6. అధిక కాంతి, విపరీతమైన ఉష్టోగ్రతలు, షిప్ట్ వర్క్ వల్ల కలిగే అంతరాయం నిద్రలేమికి కారణం అవుతుంది.

7. క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, పడుకునే ముందు ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం, బ్లూ లైట్ విడుదల చేసే ఎలక్ట్రానిక్ పరికరాల ఉపయోగం ఇవన్నీ నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతాయి.

నిద్రలేమికి చికిత్స..

నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తీసుకోవడం వంటివి నిద్రను పెంచడానికి కొన్ని సహజ మార్గాలు. సుగంధ బాత్ ఆయిల్, రూమ్ ఫ్రెషనర్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉపయోగించడం వల్ల రిలాక్స్ గా అనిపించవచ్చు. ధ్యానం, ఆసనాలు చేయడం ద్వారా నిద్రను పెంచవచ్చు.

Read LatestNavya NewsandTelugu News

గమనిక:పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Sep 10 , 2024 | 02:49 PM

Advertising
Advertising