Sleeping Problems : రాత్రి సరిగా నిద్రపోకపోతే క్యాన్సర్ ముప్పు తప్పదా..!
ABN, Publish Date - Jul 05 , 2024 | 01:08 PM
శరీరానికి నిద్ర చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే నిదురపోవాలి. రాత్రి సమయంలో నిద్ర వల్ల ఆలోచించడానికి, రక్తపోటును తగ్గించడానికి, ఆకలిని సమం చేయడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి నిద్ర అవసర పడుతుంది.
ఉదయం మొదలవడమే ఉరుకులు పరుగులతో, సమయం గడిచిపోతుందన్న కంగారులో ప్రతి ఒక్కరి రోజూ ప్రారంభం అవుతుంది. నిజానికి పిల్లలు, పెద్దలు అంతా టైం వెనుక పరుగెత్తేవారే, చదువుల ఒత్తిడులు ఒకవైపు, కెరియర్ ఒత్తిడులు మరో వైపు ఇలా రోజంతా పరుగులు తీస్తూనే ఉంటున్నారు. 24 గంటల సమయం సరిపోవడంలేదనే చాలామందికి ఉన్న కామన్ ఇబ్బంది నిద్ర రోజంతా ఒత్తిడిలో గడిపే వీరికి కరువైపోయిన నిద్ర నెమ్మదిగా పెద్ద రోగాల వైపుకు నెట్టేస్తుందని తెలుసా.. సరైన నిద్ర లేకపోతే క్యాన్సర్ బారిన పడటం ఖాయమట. తాజా అధ్యయమాలు చెబుతున్న ఈ విషయాన్ని గురించి మరింత తెలుసుకుందాం.
శరీరానికి నిద్ర చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే నిదురపోవాలి. రాత్రి సమయంలో నిద్ర వల్ల ఆలోచించడానికి, రక్తపోటును తగ్గించడానికి, ఆకలిని సమం చేయడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి నిద్ర అవసర పడుతుంది. ఒత్తిళ్ళ మధ్య చదువు, ఉద్యోగం, ఇంటి భాద్యతలు నిర్వహించడం అలవాటు చేసుకున్నవారిలో నిద్రలేమి స్యమస్య కామన్ గా కనిపించే సమస్య.
అయితే సోషల్ మీడియా పుణ్యమాని కొందరు సమయం ఉన్నా కూడా సమయాన్ని వృధా చేసుకుంటూ నిద్రను దూరం చేసుకుంటున్నారు. ఇలా తగినంత నిద్రలేకపోవడం వల్ల అనేక రుగ్మతలు, సమస్యల బారిన పడాల్సి వస్తుందని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో ముఖ్యంగా నిద్రలేమి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదట..
Skin Brightens : పసుపు నీటితో ముఖాన్ని కడిగితే చాలు.. ముఖం మెరిసిపోవడం ఖాయం...!
తక్కువ నిదరపోయే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఈ అధ్యయనాల్లో తేలింది. ప్రతి ఒక్కరికీ తనగినంత నిద్ర లేకపోతే రక్తపోటు, టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బులు, స్ట్రోక్్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనితో పాటు క్యాన్సర్, అకాలం మరణం ప్రమాదం కూడా పొంచి ఉంది.
.
Monsoons Tips : వర్షాకాలంలో ఈ ఔషధాలను తీసుకోవాల్సిందే.. వీటితో..!
మంచి నిద్రకు.. నిశ్శబ్దంగా, కాస్త వెలుతురు తక్కువగా ఉన్న గదిలో పడుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. నిద్రపోయే రెండుగంటల ముందు టీవీ, ఫోన్, ఎలక్ట్రికల్ పరికరాలను ఉపయోగించకపోవడం మంచిది. నిద్రకు ముందు తాగడం, తినడం చేయకూడదు. ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 05 , 2024 | 01:08 PM