ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips : నాన్‌స్టిక్ పాత్రల్లో వంట తింటే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టేనా..!

ABN, Publish Date - Jul 24 , 2024 | 04:09 PM

పాలీమర్ ఫ్యూమ్ ఫీవర్ అని కూడా పిలిచే టెఫ్లాన్ ఫ్లూ నాన్ స్టిక్ వంటసామాను వేడెక్కడం వల్ల వస్తుంది.

Health Benefits

ఆహారం వండేటప్పుడు కాస్త అడుగంటినా పదార్థాలు మాడు వాసన వస్తాయి. ఇక వండే పదార్థాలు అడుగంటితే, పాత్రల్ని రుద్ది రుద్ది తోమలేక తంటాలు పడాలి. తక్కువ నూనెతో మామూలు పాత్రలలో వంటచేయడం అంత సులువుగా అయ్యేపనికాదు. మామూలు వంట పాత్రల్లో వండాలంటే నూనె ఎక్కువే వేయాలి. అలా కాకుండా కాస్త పని త్వరగా అవ్వాలనుకునే వారు నాన్ స్టిక్ పాత్రలకు అలవాటు పడ్డారు. వీటిలో వంట చేయడం చాలా సులభం, పైగా పాత్రలకు పదార్థాలు అస్సలు అంటుకోవు నెమ్మదిగా అంతా నాన్ స్టిక్ పాత్రలకే అలవాటు పడ్డారు. అయితే ఇలా నాన్ స్టిక్ పాత్రల్లో వంట చేసుకుని తినడం ఆరోగ్యానికి మంచిది కాదనేది చాలా రోజులుగా వినిపిస్తున్న మాట. వీటిని ఉపయోగించడం వల్ల టెఫ్లాన్ ఫ్లూ వంటి వ్యాధులు వస్తున్నాయి. దీనితో కలిగే ఆరోగ్య ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

నాన్ స్టిక్ పాన్‌లతో సులభంగా వంట చేయవచ్చు. వీటిలో వంట సమయాన్ని ఆదా చేస్తుంది. పదార్థాలను తేలిగ్గా ఉడికిస్తాయి. అలాగే శుభ్రపరచడం కూడా చాలా తేలిక. అయితే ఈ పాన్స్ అనారోగ్య ప్రమాదాలను తెస్తున్నాయనేది ఇప్పుడు అంతటా వినిస్తున్న వాదన. కొన్ని అధ్యయమాల్లో నాన్ స్టిక్ పాన్ కోటింగ్‌లలో ఆహారం తీసుకునేవారిలో పాలిమర్ ఫ్యూమ్ ఫీవర్ లక్షణాలు అధికంగా ఉన్నాయని నివేదించాయి.

టెఫ్లాన్ ఫ్లూ అంటే..

టెఫ్లాన్ ఫ్లూ దీనినే పాలిమర్ ఫ్యూమ్ ఫీవర్ అని అంటారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద టెఫ్లాన్ పూత అంటే నాన్ స్టిక్ పాత్రలను వంటకు ఉపయోగించేటప్పుడు పాత్రలు వేడెక్కి పాత్రకు ఉపయోగించిన టెఫ్లాన్ పూత నుండి వెలువడే పొగను పీల్చడం కారణంగా ఈ ఇబ్బంది ఏర్పడుతుంది.

Health Benefits : పీనట్ బటర్, ఆల్మండ్ బటర్ ఇందులో ఏది ఆరోగ్యానికి మంచిది..!


పాలీమర్ ఫ్యూమ్ ఫీవర్ అని కూడా పిలిచే టెఫ్లాన్ ఫ్లూ నాన్ స్టిక్ వంటసామాను వేడెక్కడం వల్ల వస్తుంది. 500F(260C) కంటే ఎక్కువ వేడిచేసినప్పుడు అవి పొగను విడుదల చేస్తాయి. ఈ పొగ పెర్ఫ్లోక్టానోయిక్ యాసిడ్( PFOA), ఇతర ఫ్లోరినేటెడ్ సమ్మేళనాలను, విష రసాయనాలను కలిగి ఉంటాయి. వీటిని పీల్చడం హానికరం.

Health Tips : అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిల్లోనే ఎందుకు టైప్ 1 డయాబెటిస్ ప్రమాదం ఎక్కువ..!


టెఫ్లాన్ ఫ్లూ లక్షణాలు..

నాన్ స్టిక్ పాన్స్ వేడెక్కేటప్పుడు పీల్చే పొగ వల్ల ఈ టెఫ్లాన్ ఫ్లూ వస్తుంది. దీని లక్షణాలలో..

తలనొప్పి

చలి

జ్వరం

వికారం

ఛాతీ బిగుతుగా మారడం

దగ్గు

గొంతులో మంట

ఈ లక్షణాల కారణంగా అనిపించినా కొద్దిరోజులపాటు ఉండే అవకాశం ఉంది. కనుక ఎక్కువ శాతం మామూలు వంట పాత్రలనే ఉపయోగించడం అన్నివిధాలా మంచిది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 24 , 2024 | 04:09 PM

Advertising
Advertising
<