Health Benefits : ఉదయం ఖాళీ కడుపుతోనే వెల్లుల్లి తింటే జీర్ణ సమస్యలు మాయం..!
ABN, Publish Date - Jul 22 , 2024 | 01:15 PM
రోగనిరోధకశక్తిని పెంచడంలో, తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచేందుకు ఇన్ఫెక్షన్లను, వ్యాధులను వ్యతిరేకంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు, ముఖ్యంగా అల్లిసిన్, రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహకరిస్తాయి.
వెల్లుల్లి లేని వంటకం అంది మాసాలా కూరైనా, పప్పుచారైనా వెలితిగానే ఉంటుంది. వెల్లుల్లి ఘాటుగా ఉన్నా కూడా వంటకాల్లో తీరుకు తగినట్టుగా వాడుతూనే ఉంటాం. అంతే కాదు వెల్లుల్లి వంటకాలకే కాదు, వైద్యానికి కూడా పెట్టింది పేరు, దీని ఘాటైన తత్వం చాలా రకాలుగా ఆరోగ్యాన్ని పెంచుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరిచేందుకు కూడా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్న వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
వెల్లుల్లి అనేది ఉల్లిపాయలు, లీక్స్, షోలోట్ లకు దగ్గరి సంబంధం ఉంది. దీని ఘాటైన వాసన, రుచి కూడా అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. వెల్లుల్లి అత్యంత పోషకమైన విటమిన్లు బి6,సి, మాంగనీస్, సెలీనియం యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంది. వీటితో పాటు సల్ఫర్, ముఖ్యంగా అల్లిసిన్ కలిగి ఉంది. ఇది ఆరోగ్యానికి మంచిది. అంటువ్యాధులను, గుండె సమస్యలను తగ్గిస్తుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేవంటే..
Drinking Vamu Water : వాము నీటిని ప్రతిరోజూ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే...
రోగనిరోధకశక్తిని పెంచడంలో, తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచేందుకు ఇన్ఫెక్షన్లను, వ్యాధులను వ్యతిరేకంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు, ముఖ్యంగా అల్లిసిన్, రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహకరిస్తాయి. వెల్లుల్లిలోని అల్లిసిన్ రక్త నాళాలను సడలించడంలో సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తుంది. ఎల్ డి ఎల్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. కాలేయం ఆరోగ్యానికి సహకరిస్తుంది. తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు కారణంగా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
Good Heabits : ఒత్తిడి లేని జీవనానికి 7 అలవాట్లు ఇవే.. !
1. వెల్లుల్నిలో సెలీనియం, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుండి కణాలను రక్షిస్తాయి.
2. జీర్ణ ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది.
3. ఇందులోని యాంటీ బాక్టీరియ్, యాంటీ వైరల్ లక్షణాలు బాక్టీరియా, వైరస్‌లతో పోరాడేందుకు సహకరిస్తాయి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Jul 22 , 2024 | 01:15 PM