ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips : ఈ గింజలు తింటే శరీరానికి బోలెడు ఐరన్ ..!

ABN, Publish Date - Aug 06 , 2024 | 01:04 PM

ఐరన్ లోపం వల్ల శరీరంలో రక్త హీనత ఏర్పడుతుంది. అలసటగా, నీరసంగా అనిపిస్తుంది. తల తిరగడం, ఏ పని మీదా ఏకాగ్రత లేకపోవడం, చికాకు, చర్మం పాలిపోవడం వంటి సమస్యలు ఉంటాయి.

Health Benefits

ఐరన్ లోపం వల్ల శరీరంలో రక్త హీనత ఏర్పడుతుంది. అలసట, నీరసంగా అనిపిస్తుంది. తల తిరగడం, ఏ పని మీదా ఏకాగ్రత లేకపోవడం, చికాకు, చర్మం పాలిపోవడం వంటి సమస్యలు ఉంటాయి. ఊపిరి ఆడనట్టుగా, గుండె దడ, గోళ్లలో బలం లేకపోవడం, జుట్టు రాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐరన్ శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ఖనిజం. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ముఖ్యమైనది. ఐరన్‌ను పెంచే గింజల గురించి తెలుసుకుందాం.

ఈ గింజల్లో పోషకాలతో పాటు, ఆరోగ్యకరమైన కొవ్వులు, మాంసకృతులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు కలిగిన గొప్ప ఆహారం. వీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. గోధుమలు, మిల్లెట్లు, ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా అన్నింటిలోనూ ఐరన్ ఉంటుంది. 100 గ్రాముల ఓట్స్ లో 4.7 మి. గ్రాముల ఐరన్ ఉంటే క్వినోవాలో 1.5 మి.గ్రాముల ఐరన్ ఉంటుంది. గోధుమలో 100 గ్రాములకు 3.9 మి.గ్రాముల ఐరన్ ఉంటుంది.

తృణధాన్యాలలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. తృణధాన్యాలు మన జీర్ణక్రియను మెరుగుపరిస్తాయి. గుండె జబ్బులు, స్ట్రాక్, మధుమేహం, ఊబకాయం, క్యాన్సర్ మొదలైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Health Tips : వానాకాలంలో జలుబు, దగ్గుకు లవంగాలతో చెక్ పెట్టేదెలా..!


గుమ్మడి గింజలు..

గుమ్మడికాయ గింజలను తీసుకంటే శరీరంలో శక్తి కలుగుతుంది. ఇందులో మెగ్నీషియం, జింక్, ఐరన్ ఇంకా అనేక ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, మంచి నిద్రకు సహకరిస్తాయి.

నువ్వు గింజలు..

నువ్వు గింజల్ని వంటల్లో ఉపయోగించడం వల్ల రుచి కూడా పెరుగుతుంది. ఈ నువ్వులలో అధికంగా ఐరన్ ఉంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఒక టేబుల్ స్పూన్ నువ్వుల్లో 1.3 మిల్లీ గ్రాముల వరకూ ఐరన్ ఉంటుంది.

Healthy Foods : నానబెట్టిన బాదం, వేరుశెనగలో ఏది ఆరోగ్యానికి మంచిది ?

పొద్దు తిరుగుడు విత్తనాలు..

పొద్దు తిరుగుడు విత్తనాలలో ఐరన్, సెలీనియం, మెగ్నీషియం, విటమిన్ ఇ, ప్రోటీన్లు, ఫైబర్ కూడా పుష్కలంగా ఉన్నాయి.

అవిసె గింజలు..

అవిసె గింజలు అధిక శాతంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో పాటు ఐరన్ కలిగి ఉన్నాయి.

చియా విత్తనాలు..

ఈ చియా గింజల్లో ఐరన్, ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియంతో సహా అనేక పోషకాలున్నాయి. చియా గింజలు గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు, ఎముకల బలానికి అద్భుతమైన ఆహారం.


Health Tips : వానాకాలంలో జలుబు, దగ్గుకు లవంగాలతో చెక్ పెట్టేదెలా..!

జనపనార విత్తనాలు..

జనపనార గింజల్లో ప్రోటీన్, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి.

క్వినోవా గింజలు..

క్వినోవాలో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఇది రక్తంలో ఐరన్‌ను పెంచుతుంది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Aug 06 , 2024 | 01:04 PM

Advertising
Advertising
<