ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Cooking Tips : వంట సులభంగా, ఇబ్బంది లేకుండా చేయడానికి ఈ చిట్కాలు పాటించండి..!

ABN, Publish Date - Apr 17 , 2024 | 04:08 PM

గత కొన్ని సంవత్సరాలుగా మనలో చాలా మంది ఆరోగ్యం పట్ల అవగాహనతో ఉన్నారు. ఆహారంలో క్రీమ్‌ను ఉపయోగించకుండా, క్రీమ్‌గా మార్చడానికి పాలు, మలాయ్ లేదా జీడిపప్పు పేస్ట్‌ని ఉపయోగించవచ్చు. ఇవి బరువు పెరిగే సమస్యను పక్కన పెట్టి, పూర్తి ఆరోగ్యాన్ని ఇస్తాయి.

cooking

వంట (cooking) విషయానికి వస్తే, సరైన మొత్తంలో కమ్మని రుచిని పొందడం కోసం వంటగదిలో పనిని సులభం చేసుకోవాలి. కూరగాయలు లేదా కూరలకు మసాలాలు కలపడమే పెద్దపనిగా మారిపోతుంది. కొన్నిసార్లురోటీలు చాలా గట్టిగా రావచ్చు, లేదా మరికొన్ని సార్లు ఆహారంలో ఉప్పు కొంచెం ఎక్కువగా ఉంటుంది. మంచి భోజనం వండడానికి అన్ని సవాళ్లను అధిగమించి, వంటగదిలో పనిని సులభతరం చేయడానికి కొన్ని ఉపాయాలు పాటించక తప్పదు.

వంట నైపుణ్యాలను పెంచుకోవడానికి, వండే వంటకాలకు తక్కువ సమయం పట్టాలన్నాకూడా తగిన విధంగా పనిని ఫ్లాన్ చేసుకోవాలి. దీనికి కొన్ని చిట్కాలను పాటించితే పని సులభం అవుతుంది.

రోజువారీ వంటను సులభంగా, సౌకర్యవంతంగా చేయడానికి

1. చపాతీలను ఎలా సాఫ్ట్‌గా చేయాలి.

పిండి కలపడంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం. పిండి సరిగా కలపకపోతే చపాతీలు మృదువుగా రావు. మెత్తగా ఉండాలంటే, గోరువెచ్చని నీటితో పిండిని మెత్తగా కలిపి పెట్టుకోవాలి. పిండిని పిసికిన తర్వాత మెత్తగా అనిపిస్తే, పిండిని కనీసం 15 నిమిషాలు ఉంచి తర్వాత వేపుకోవాలి. ఇలా చేస్తే చపాతీలు మెత్తగా వస్తాయి.

2. క్రీమీ కూరలు ఎలా తయారు చేయాలి.

గత కొన్ని సంవత్సరాలుగా మనలో చాలా మంది ఆరోగ్యం పట్ల అవగాహనతో ఉన్నారు. ఆహారంలో క్రీమ్‌ను ఉపయోగించకుండా, క్రీమ్‌గా మార్చడానికి పాలు, మలాయ్ లేదా జీడిపప్పు పేస్ట్‌ని ఉపయోగించవచ్చు. ఇవి బరువు పెరిగే సమస్యను పక్కన పెట్టి, పూర్తి ఆరోగ్యాన్ని ఇస్తాయి.

Skin : ఎండవేడిని తట్టుకుని స్కిన్ మెరవాలంటే.. ఇలా చేయండి.!

3. చిక్‌పీ (చానా) వేగంగా ఉడకబెట్టడం ఎలా..

(శనగలు) చనాస్ నానబెట్టడం మర్చిపోయినట్లయితే, బాధపడాల్సింది ఏం లేదు. దీనికి గంటలో వాటిని సిద్ధం చేయడానికి ఈ ట్రిక్ ఉపయోగించండి. చేయాల్సిందల్లా కుక్కర్‌లో నీటిని మరిగించి, అందులో అవసరమైన మొత్తంలో చనా వేయండి. ఉడకబెట్టిన చానా కూరకు ఉపయోగించవచ్చు.

4. ఆల్ ఇన్ వన్ గ్రేవీని ఎలా తయారు చేయాలి.

భోజనం సిద్ధం చేయడానికి సమయం అయిపోతుందా? ముందుగా కొన్ని టొమాటోలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం తీసుకుని మెత్తగా అయ్యేవరకు వేయించాలి. తర్వాత అన్నింటినీ కలపండి. రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకుంటే ఎప్పుడు కూర అవసరం అయినా కాసింత తీసుకుని వాడేయవచ్చు.


This Summer : ఈ వేసవిలో వ్యాధులకు నో చెప్పండి.. ముఖ్యంగా డయేరియా వచ్చే అవకాశాన్ని ఇలా తప్పించుకోండి.

5. కూరల్లో ఉప్పును ఎలా తగ్గించాలి.

వంట చేయడం కొత్త అయితే, కొన్నిసార్లు కొలతలు తప్పుగా ఉంటాయి. ఆ ప్రక్రియలో, మనలో చాలామంది సాధారణంగా మన ఆహారంలో అదనపు ఉప్పును కలుపుతాం. కాబట్టి ఉప్పు ఎక్కువైతే పాలు లేదా మలైని కలపవచ్చు. ఆ విధంగా, ఉప్పు రుచి తగ్గుతుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 17 , 2024 | 04:11 PM

Advertising
Advertising