ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips : ఈ జాగ్రత్తలు తీసుకుంటే మెడనొప్పి ఇబ్బంది ఉండదు..!

ABN, Publish Date - Jul 31 , 2024 | 02:21 PM

మెడ వెనుక కండరాలు రిలాక్స్ కావాలంటే క్రమం తప్పకుండా విరామాలు తీసుకోవాలి. ఈ సమయంలో మెడను అటు ఇటు తిప్పడం కూడా మంచి వ్యాయామం.

Health Benefits

సాంకేతికత బాగా పెరిగిన తర్వాత స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ పరికరాలతో నిత్యం పనిచేయడం వల్ల చాలా మందిలో కనిపించే సమస్య టెక్ నెక్, మెడ నొప్పి. ఇది మెడ కండరాలను నిరంతరం ఒత్తిడికి గురి చేయడం వల్ల కలిగే సమస్య. ఈ మెడ నొప్పి ప్రధానంగా ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తున్నప్పుడు కలిగే ఇబ్బంది. అదే పనిగా నరాలను ఒత్తిడికి గురి చేయడం వల్ల కూడా దీర్ఘకాలిక మెడ నొప్పిగా మారుతుంది. దీనికి ప్రధాన కారణాలు, నివారణలు తెలుసుకుందాం.

మెడనొప్పికి కారణాలు..

సరైన భంగిమలో వెన్నుముకను ఉంచకపోవడం, సరైన భంగిమలో కూర్చోకపోవడం, కీళ్లవాపు, హెర్నియేటెడ్ డిస్క్ (Herniated disc) వంటి సమస్యలు మెడనొప్పికి ప్రధాన కారణాలు.

టెక్ నెక్ సమస్య వల్ల..

టెక్ నెక్ సమస్య ఎక్కువగా ఉంటే వెన్నుముక మీద ఒత్తిడి కండరాల అమరికను మార్చుతుంది. మెడ, భుజాలపై పెరిగే ఒత్తిడి భుజం నొప్పి, నడుము నొప్పి, చేతుల్లో తిమ్మిరి, లేదా జలదరింపుకు అసౌకర్యానికి కారణం అవుతుంది. దీనితో పాటు (rotator cuff tendonitis), (cervical kyphosis) వంటి సమస్యలకు కారణం కావచ్చు.

ఈ జాగ్రత్తలు పాటిస్తే..

ఫోన్ లేదా టాబ్లెట్ ఉపయోగిస్తుంటే మాత్రం ఎప్పుడూ అవి కంటి స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెడ నొప్పి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

ఎర్గోనామిక్ సెటప్..

కంప్యూటర్‌లో పని చేస్తున్నప్పుడు మానిటర్‌ స్క్రీన్‌ను చేయి పొడవు దూరంలో ఉండేలా చూసుకోవాలి.

విరామాలు అవసరం..

మెడ వెనుక కండరాలు రిలాక్స్ కావాలంటే క్రమం తప్పకుండా విరామాలు తీసుకోవాలి. ఈ సమయంలో మెడను అటు ఇటు తిప్పడం కూడా మంచి వ్యాయామం.


Health Tips : కాల్చిన అల్లం, తేనెతో జలుబు, గొంతు నొప్పికి చెక్ పెట్టండిలా... !

వర్క్ స్పేస్..

పనిచేసే చోట కూర్చునే విధానంలో కూడా జాగ్రత్తలు అవసరం. సరైన భంగిమలో కూర్చోనట్లయితే వెన్ను నొప్పి, మెడ నొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే..

1. వెన్నుముకను నిటారుగా ఉంచడం, తలను మెల్లగా వెనక్కి కడుపుతూ ఉండటం చేయాలి.

2. భుజాలను పైకి, కిందకీ తిప్పుతూ రోల్ చేయాలి.


Health Tips : తిన్న తర్వాత విషంగా మారే ఆహారపదార్ధాలు ఇవే..

3. కూర్చున్న భంగిమ నుంచి మెడను అటు ఇటు కదుపుతూ ఉండాలి.

4. ఛాతీ, భుజాలు సాగదీయడానికి రివర్స్ ఫోల్డర్ స్ట్రెచ్ చేస్తూ ఉండాలి.

ఇలాంటి చిన్న చిన్న వ్యాయామాలతో మెడనొప్పిని తగ్గించుకోవచ్చు. సమస్య మరీ ఎక్కువైతే ఫిజికల్ థెరపిస్ట్‌ను సంప్రదించడం సరైన మార్గం.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 31 , 2024 | 02:23 PM

Advertising
Advertising
<