Health Tips : ఈ మసాలా దినుసు వాడితే చాలు.. రక్తంలో చక్కెర స్థాయిలు ఇట్టే కంట్రోల్లోకొస్తాయి.. !!
ABN, Publish Date - Sep 09 , 2024 | 03:44 PM
మధుమేహం ఉన్నవారు జీవితాంతం మందులు వాడాల్సిందే. వీరికి దాల్చిన చెక్క మంచి ఉపయోగకరంగా ఉంటుంది. షుగర్ లెవల్స్ పెరగకుండా చేస్తుంది. దాల్చిన చెక్కలోని ఫ్లేవనాయిడ్స్ లాంటి అనేక రకాల పోషకాలున్నాయి. దాల్చిన చెక్కలోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ట్యూమర్, యాంటీ ఇన్ఫ్లెమేటరీ, యాంటీ క్యాన్సర్ గుణాలున్నాయి.
మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. వీటిని ఆరోగ్యంగా ఉండటానికి జీవనశైలిలో మార్పులు చేయడం ముఖ్యం. మధుమేహం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. దీని పెరుగుదల కారణంగా గుండె జబ్బులు, దృష్టి కోల్పోవడం, మూత్రపిండాల వ్యాధి వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో జీవనశైలి మార్పులు చేయడం కూడా ముఖ్యం. సమతుల్య ఆహారం తీసుకోవడం కీలకం. చక్కెర స్థాయిలు అదుపులో ఉండేందుకు ఇంటి నివారణల్లో ముఖ్యంగా దాల్చిన చెక్క నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
దాల్చిన చెక్కలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఈ సుగంధ ద్రవ్యం వంటకాల్లో మనం తరచుగా వాడేదే. ఇది శరీరంలో శక్తి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో శక్తివంతంగా మార్చడంలో సహకరిస్తుంది. దాల్చిన చెక్కలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే సమ్మేళనాలున్నాయి. అవి శరీరంలో ఇన్సులిన్‌ను మరింత ప్రభావవంతంగా ఉపయోగించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దాల్చిన చెక్క నీరు ఉదయాన్నే తీసుకుంటే గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.
Smoking Habit: ధూమపానం చేస్తున్నారా..! మీ హెల్త్ ఎంత వరకూ పాడైందో ఇలా తెలుసుకోండి..!
దాల్చిన చెక్కతో గ్లూకోజ్ స్థాయిలు..
పురాతన ఈజిప్షియన్ల కాలం నుంచి సువాసన గల దాల్చిన చెక్కను శ్వాస ఇబ్బందికి, కడుపు నొప్పి ఉన్న సమయంలో దీనిని ఉపయోగించేవారు. మధుమేహం ఉన్నవారు జీవితాంతం మందులు వాడాల్సిందే. వీరికి దాల్చిన చెక్క మంచి ఉపయోగకరంగా ఉంటుంది. షుగర్ లెవల్స్ పెరగకుండా చేస్తుంది. దాల్చిన చెక్కలోని ఫ్లేవనాయిడ్స్ లాంటి అనేక రకాల పోషకాలున్నాయి. దాల్చిన చెక్కలోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ట్యూమర్, యాంటీ ఇన్ఫ్లెమేటరీ, యాంటీ క్యాన్సర్ గుణాలున్నాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి.
రోజుకు ఒక కప్పు దాల్చిన చెక్క నీరు త్రాగాలి. ఉదయాన్నే పరగడుపుతో లేదా భోజనానికి ముందు దీనిని తీసుకోవాలి. చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉండేందుకు సిలోన్ దాల్చిన చెక్కను ఎంచుకోవాలి. కాసియా చెక్క కన్నా సిలోన్ దాల్చిన చెక్క మంచిది. ఎందుకంటే ఇందులో తక్కువ స్థాయిలో కొమరిన్ ఉంటుంది. ఇది పెద్ద మొత్తంలో ఉంటే కనుక శరీరానికి హాని చేస్తుంది. కనుక సిలోన్ దాల్చిన చెక్క ఎంచుకుంటే సరి.
Smoking Habit: ధూమపానం చేస్తున్నారా..! మీ హెల్త్ ఎంత వరకూ పాడైందో ఇలా తెలుసుకోండి..!
దీనితో మరిన్ని ప్రయోజనాలు..
దాల్చిన చెక్క అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ కారణంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. నిమ్మకాయ రసం, దాల్చిన చెక్క పొడి, గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇది యాంటీ బాక్టీరియల్ గుణం కలిగి ఉంటుంది కనుక మెటిమల సమస్యను కూడా తగ్గిస్తుంది. దాల్చిన చెక్క పొడిని తేనెలో కలిపి తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
Read LatestNavya NewsandTelugu News
గమనిక:పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Sep 09 , 2024 | 03:45 PM