Health Tips : ఖాళీ కడుపుతో ఉదయాన్నే నీరు తాగడం ఆరోగ్యమేనా..!
ABN, Publish Date - Aug 07 , 2024 | 04:00 PM
శరీరం సహజంగా మూత్ర విసర్జన చేయడం, చెమటలు పట్టడం, ఊపిరి పీల్చుకోవడం వంటి సాధారణ ప్రక్రియల ద్వారా ప్రతిరోజూ నీటిని కోల్పోతుంది.
శరీరానికి నీరు చాలా అవసరం. డీహైడ్రేషన్ కాకుండా, వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు గురికాకుండా శరీరాన్ని రక్షిస్తుంది. శరీరంలో నీటికొరత కారణంగా అనేక ఇబ్బందులు మొదలవుతాయి. శరీరానికి నీరు అవసరమనే ఆలోచనతో ఉదయాన్నే నాలుగు లీటర్లవరకూ నీరు తాగాలనే లక్ష్యాలను పెట్టుకుని మరీ నీరు తాగేవారు కూడా ఉంటారు. అయితే నీరు ఉదయాన్నే తీసుకోవడం సరైనదేనా.. ఇందులో ఎంత వరకూ నిజం ఉంది. తెలుసుకుందాం.
నీరు జీవనాధారం. నీరు లేనిదే మానవ మనుగడ లేదు. ప్రాణాధారమైన నీరు శరీరానికి నిత్యం అవసరమే. ప్రతి ఒక్కరూ నీటిని ఎక్కువగా తాగాలని వైద్యులు చెబుతూనే ఉంటారు. నీరు తాగితే బరువు తగ్గుతారని కూడా చాలా వరకూ ఈ పద్దతిని ఫాలో అవుతారు. అయితే ఇలా చేయడం వల్ల రాత్రి పూట నోటిలో ఉన్న బ్యాక్టీరియా ప్రేగులలోకి ప్రవేశిస్తుంది. అధికంగా నీరు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. మల విసర్జన సాఫీగా సాగుతుంది.
శరీరం సహజంగా మూత్ర విసర్జన చేయడం, చెమటలు పట్టడం, ఊపిరి పీల్చుకోవడం వంటి సాధారణ ప్రక్రియల ద్వారా ప్రతిరోజూ నీటిని కోల్పోతుంది. వ్యాయామం, వేడి వాతావరణం, కొన్ని రకాల మందుల కారణంగా కూడా శరీరం నీటిని కోల్పోయేలా చేస్తాయి. మానవ శరీరం దాదాపు 60 శాతం నీటితో నిండి ఉంటుంది. ఈ లెక్కలు వయస్సు, లింగం, హైడ్రేషన్ కారణంగా కొద్దిగా మారవచ్చు. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, పోషకాలను రవాణా చేయడానికి, మూత్రం, చెమట ద్వారా వ్యర్థాలను విసర్జించడానికి నీరు అవసరం.
Festival Time : హరియాలీ తీజ్ వేడుకల్లో ఖీర్ ఎందుకు చేస్తారు?
1. నీరు తాత్కాలికంగా తాగడం ఆపేసినప్పుడు డీహైడ్రేషన్ అవుతుంది.
2. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరుతాగడం వల్ల సుఖ విరోచనం అవుతుంది. ప్రేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
3. ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు వెళ్లి చర్మానికి మెరిసేలా నిగారింపును ఇస్తుంది.
Health Tips : తల్లిపాలతో బిడ్డకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి..!
నీటిని ఖాళీ కడుపుతోనే ఎందుకు తాగాలి.
పరగడుపునే కాఫీ, టీలను తీసుకోవడం కన్నా నీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా లాభాలుంటాయి.
నోట్లోని బ్యాక్టీరియా కారణంగా పళ్లు తోముకుంటాం. పళ్లు తోముకునే ముందు నీటిని త్రాగడం వల్ల బ్యాక్టీరియా చాలా వరకూ పోతుంది. దీనితో దంత క్షయం, కావిటీస్ సమస్యలు ఉండవు. ఉదయాన్నే నీరు త్రాగితే ప్రేగు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఖాళీ కడుపుతో నీరు కాకుండా ఏ పదార్థాలను తినకూడదు అనేది దంత ఆరోగ్యం కోసమే. ఇలా చేయడం వల్ల దంతాలు పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Aug 07 , 2024 | 04:36 PM