Health Tips : ఒత్తిడిగా అనిపిస్తే నోరు పొడిబారుతుందా.. ఇది ఇంకా దేనికి సంకేతం..!
ABN, Publish Date - Aug 10 , 2024 | 10:21 AM
ఆందోళన, ఒత్తిడితో ఉన్నప్పుడు శరీరం ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటుంది. ఇది హైపర్ వెంటిలేషన్‌కు దారితీస్తుంది. ముక్కుకు బదులు నోటితో శ్వాసను తీసుకుంటాం. నోటి ద్వారా గాలి తీసుకోవడం వల్ల కూడా నోటిలో తేమ ఆవిరై నోరు పొడిబారుతుంది.
ఒత్తడి, ఆందోళన చాలా సమస్యలకు కారణం అవుతాయి. చిన్న విషయానికే చాలా కంగారు పడటం, నిద్ర సరిగా ఉండకపోవడం, ఏ పని చేయాలని అనిపించకపోవడం కూడా ఒత్తిడి సంకేతాలే. ఇలాంటి సందర్భాల్లో ఒకరకంగా చాలా గందరగోళంగా ఉంటుంది. ఈ ఒత్తిడి కలిగినప్పుడు శరీరంలో కూడా చాలా మార్పులు కలుగుతాయి. ముఖ్యంగా నోరు పొడిబారిపోతుంది. ఇది మామూలుగా అనిపించే పరిస్థితే అయినా నోరు పొడిబారడానికి వెనుక కారణమయ్యే విషయాలను గురించి తెలుసుకుందాం.
నోరు పొడిబారడానికి కారణాలు...
ఆందోళన, నోరు పొడిబారడానికి, ఒత్తిడికి ప్రధాన కారణం, ఏదైనా విషయంలో ఆతృతగా ఉన్నప్పుడు, శరీరం చాలా గందరగోళ పరిస్థితుల్లోకి పడిపోతుంది. శరీరం కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు లాలాజల గ్రంధులు తక్కువ లాలాజలాన్ని ఉత్పత్తి చేయడానికి కారణమవుతాయి. దీనితో నోరు పొడిబారుతుంది.
ఆందోళన ఉన్నవారిలో దానిని తగ్గించడానికి వాడే మందుల కారణంగా కూడా నోరు పొడిబారుతుంది. ఈ మందుల్లో ఉండే యాంటీడిప్రెసెంట్స్, యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్, యాంటీ సైకోటిక్స్ కారణంగా కూడా నోరు పొడిబారుతుంది.
Health Tips : నిద్ర పక్షవాతం గురించి ఈ విషయాలు తెలుసా...!
ఆందోళన, ఒత్తిడితో ఉన్నప్పుడు శరీరం ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటుంది. ఇది హైపర్ వెంటిలేషన్‌కు దారితీస్తుంది. ముక్కుకు బదులు నోటితో శ్వాసను తీసుకుంటాం. నోటి ద్వారా గాలి తీసుకోవడం వల్ల కూడా నోటిలో తేమ ఆవిరై నోరు పొడిబారుతుంది.
ఆందోళన కూడా డీహైడ్రేషన్‌కు కారణం అవుతుంది. పొడి నోరు మరింత తీవ్రంగా మారితే చెమట ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి శరీరంలో ద్రవాలను కోల్పోయేలా చేస్తుంది. డీహైడ్రేషన్ పెంచుతుంది.
Weight Loss : ఈ దోశతో బరువు ఇట్టే తగ్గొచ్చు.. ఎలా తయారు చేయాలంటే..!
ఆందోళన నోటి శుభ్రత అలవాట్లు సరిగా లేకపోయినా కూడా నోరు పొడిబారేలా చేస్తుంది. ఆత్రుత, ఆందోళన ఉన్నప్పుడు క్రమం తప్పకుండా బ్రష్ చేయడం, నోటి శుభ్రతను పాటించడం ముఖ్యం.
Festival Time : హరియాలీ తీజ్ వేడుకల్లో ఖీర్ ఎందుకు చేస్తారు?
నోరు పొరిబారడం ఎలా తగ్గుతుంది.
దీనికి ప్రతిరోజూ ధ్యానం, యోగా వంటి పద్దతులు కొద్ది వరకూ సహకరిస్తాయి.
ఆందోళనగా అనిపించినప్పుడు శ్వాసను లోపలి నుంచి బయటకు పీల్చడం, వదలడం చేయాలి. ఇది నోరు పొడిబారకుండా చేస్తుంది.
డీహైడ్రేషన్ కలగకుండా నీటిని క్రమం తప్పకుండా త్రాగాలి.
Health Tips : పొట్ట ఆరోగ్యాన్ని పెంచే పానీయం ఇదే.. !
రోజుకు రెండుసార్లు నోటి శుభ్రతను పాటించాలి. చక్కెర, పుల్లని ఆహారాలు, పానీయాలను తగ్గించాలి. ఇవి దంత సమస్యలు రాకుండా చేస్తుంది.
మానసిక, శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వంటివి నోరు పొడిబారే సమస్య నుండి, ఆందోళవరకూ నయం చేస్తాయి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Aug 10 , 2024 | 10:21 AM