ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vitamin D Benefits : విటమిన్ డి లోపం కారణంగా సప్లిమెంట్స్ వాడుతున్నారా?

ABN, Publish Date - Jun 27 , 2024 | 04:26 PM

ప్రతిరోజూ 1000 IU లేదా అంతకంటే ఎక్కువ విటమిన్ డి తీసుకునే వ్యక్తులలో దాదాపు పెరుగుదల తగ్గినట్టే.. కొందరు పరీక్షలు చేయించుకోకుండానే మెడికల్ స్టోర్ నుంచి విటమిన్ డి మందులు కొని తెచ్చుకుని వాడుతున్నారు.

Vitamin D benefits

విటమిన్ డి పొందాలంటే ఎండలో పగటి పూట ఉంటే సరిపోతుంది. ఇటీవలి కాలంలో ఎండకు శరీరం ఉండటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీనితో శరీరంలో చాలా రకాల మార్పులు వస్తున్నాయి. విటమిన్ డి లోపం ఎండలో ఉండకపోవడం వల్ల కలిగేదే. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, మూడ్ డిజార్డర్స్ వంటివి ఈ విటమిన్స్ లోపాలతో ఏర్పడేవే.. శరీరంలో విటమిన్ డి లోపం అనేది ఒకసారి వచ్చిందని తెలిసినపుడు డాక్టర్ సలహామీద మాత్రమే సప్లిమెంట్స్ జోలికి వెళ్ళాలి కానీ చాలా వరకూ డాక్టర్ సలహా మీద కాకుండా మందుల షాపుల్లో సప్లిమెంట్స్ తెచ్చుకుని వాడేయడం చాలా అనర్థాలకు కారణం అవుతుందని చెబుతాన్నారు డాక్టర్స్.

ప్రతిరోజూ 1000 IU లేదా అంతకంటే ఎక్కువ విటమిన్ డి తీసుకునే వ్యక్తులలో దాదాపు పెరుగుదల తగ్గినట్టే.. కొందరు పరీక్షలు చేయించుకోకుండానే మెడికల్ స్టోర్ నుంచి విటమిన్ డి మందులు కొని తెచ్చుకుని వాడుతున్నారు. విటమిన్ డి ఎలాంటి సమస్య గురించి ఆలోచించకుండా వేసుకునే మ్యాజిక్ పిల్ అయితే కాదు. విటమిన్ డి మందులు తీసుకునే బదులు రోజువారి అవసరాలను తీర్చుకోవడానికి సూర్యరశ్మికి గురైన తర్వాత చర్మంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. కాలేయం, మూత్రపిండాలు దాని క్రియాశీల రూపంలోకి మారుస్తాయి.

Herbs And Spices : కిడ్నీ, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఇవే..


శరీరంలో విటమిన్ డి లోపం ఉందని తెలిస్తే మొదట వైద్యుని సంప్రదించాలి. కండరాల బలహీనత, శరీర నొప్పిీ, లేదా కూర్చోవడంలో వస్తున్న ఇబ్బంది, ఈ పరిస్థితిలో డాక్టర్ సలహా మీద సప్లిమెంట్లు తీసుకోవడం అవసరం.

పరీక్ష తర్వాత డాక్ట్ర్ విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలని చెప్పాకా అతను చెప్పినంత వరకే వాడాలి. నిజానికి ఆహారంలో లోపం కారణంగా కూడా విటమిన్ లోపం ఏర్పడుతుంది.

Herbs And Spices : కిడ్నీ, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఇవే..


మనం తీసుకునే ఆహారంలో పాలు, రసం, పిండి, బ్రెడ్ వంటి ఆహారాలతో విటమిన్ డి కావాల్సిన మొత్తంలో అందకపోవచ్చు. దీనికి గుడ్లు, చికెన్, సమతుల్య ఆహారం వంటివి పౌష్టికమైన ఆహారాలను తీసుకుంటూ ఉండాలి.

గర్భిణీ స్త్రీ విటమిన్ డి లోపం ఉంటుంది. నవజాత శిశువుల శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే సప్లిమెంట్లు వాడవచ్చు. వయసు పై బడిన వారు 70 సంవత్సరాల వయసు వారు కూడా విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవచ్చు. మిగతావారు కూడా ఆహారం ద్వారా సూర్యకాంతి ద్వారా అందుకోవడం ఆరోగ్యానికి మంచిది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 27 , 2024 | 04:26 PM

Advertising
Advertising