ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kantola : ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే ఆకాకర కాయ గురించి తెలుసా..!

ABN, Publish Date - Apr 15 , 2024 | 11:52 AM

బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ కావడానికి ఆకాకర చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది.

Kantola

ఆకాకర అనేది కాకర కుటుంబానికి చెందిన అంతగా తెలియని కూరగాయ. ఈ మధ్య కాలంలో దీనిలో ఉండే పోషకాల కారణంగా ఇది అందరికీ తెలుస్తుంది. ముఖ్యంగా చేదు ఉండని కాయలు కావడం, కమ్మదనంగా ఉండడం వల్ల దీనిని అంతా తినేందుకు ఇష్టపడతారు. ఇది వర్షాకాలంలో సులభంగా లభిస్తుంది. దీనిని స్పైనీ గోర్డ్ అని కూడా పిలుస్తారు. ఇది ఓవల్ ఆకారపు కరేలాలా కనిపిస్తుంది. లేత ఆకుపచ్చ రంగును కలిగి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది ఫైబర్, విటమిన్లు, మినరల్స్,ఆకాకర కాయ రోగనిరోధక శక్తిని పెంచడంలో పాటు లోపల నుండి మనల్ని పోషించడంలో సహాయపడుతుంది. దీని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. సులభంగా జీర్ణం కావడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది సీజన్‌లో ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఇది ప్యాంక్రియాటిక్ బీటా కణాలను రక్షించే, పునరుత్పత్తి చేసే హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే, ఇది ఇన్సులిన్ స్రావం, ఇన్సులిన్ సెన్సిటివిటీ రెండింటినీ మెరుగుపరుస్తుంది.

1. తక్కువ క్యాలరీలు, కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా ఆకాకర కాయ ఆరోగ్యానికి అధిక మద్దతు ఇస్తుంది.

2. జీర్ణక్రియకు సహాయపడే ఆకాకరకాయలో సహజంగా లభిండే డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

ఈ మృదువైన, కొబ్బరి మలై తింటే ఎన్ని బెనిఫిట్స్ అంటే.. మీరు అస్సలు ఊహించరు..!

3. న్యూట్రీషియన్ పవర్ హౌస్.. ఆకాకరలో అనేది పోషకాహరంగా పనిచేస్తుంది. దీనిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్ సి వంటివి ముఖ్యమైన పోషకాలుగా ఉన్నాయి.

4. బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ కావడానికి ఆకాకర చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది.

5. అనామ్లజనకాలు సమృద్ధిగా ఉండే ఆకాకరలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్లు, పాలీఫెనాల్స్, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, ఫ్రీరాడికల్స్ కణాలకు చేసే హానిని అడ్డుకొనడానికి సహాయపడుతుంది.


శరీర దుర్వాసన నుంచి ఉపశమనం పొందాలంటే.. ఇలా చేయండి చాలు..

6. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్న ఆకాకరలో కీళ్ల నొప్పులు, వాపులు, తగ్గించే శక్తి ఉంది. ఇది ఆర్థరైటిస్ వంటి పరిస్థితులతో బాధపడుతున్నవారికి మంచి ఆహారం.

7. గుండె ఆరోగ్యాన్ని కూడా ఆకాకర ప్రోత్సహిస్తుంది. ఇది అధిక ఫైబర్, అధిక పొటాషియం, అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

8. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఆకాకరలో అధిక విటమిన్ సి కంటెంట్ అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్ లకు వ్యతిరేకంగా రక్షణను ఇస్తాయి.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి

Updated Date - Apr 15 , 2024 | 12:00 PM

Advertising
Advertising