ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Light Therapy: లైట్ థెరపీ శరీరంలో చాలా మార్పులకు ఇది అవసరం.. ముఖ్యంగా నిద్రకు..!

ABN, Publish Date - Apr 08 , 2024 | 03:39 PM

సూర్యుడి నుండి వచ్చే కాంతి లేదా లైట్ థెరపీలో వాడే ప్రత్యేక బల్బుల నుంచి వచ్చే కాంతి… ఇది మానసిక స్థితిని సంతోషంగా మారుస్తుంది.

Light Therapy

Light Therapy: శరీరానికి ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. మరి మెదడుకో ప్రశాంతత కావాలి. ఇవి రెండూ కావాలంటే దినచర్యలో మార్పులు రావడం అవసరం. దీనికి ఆనందంగా ఉండేందుకు శరీరంలో సెరోటోనిన్ విడుదల అవ్వాలి. ఈ హార్మోన్ విడుదలైతేనే మంచి నిద్రపడుతుంది. ఇప్పటి రోజులో అందరికీ నిద్ర సమస్య కాస్త ఎక్కువగానే ఉంది. నిద్ర సరిగా ఉంటేనే ప్రశాంతంగా జీవించగలుగుతారు. దీనికి లైట్ థెరపీ సరిగ్గా పనిచేస్తుంది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..

లైట్ థెరపీ మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. సూర్యుని నుంచే వచ్చే కాంతి శరీరానికి ఎంతో ముఖ్యమైనది. పని ఒత్తిడుల కారణంగా చాలా తక్కువ మంది మాత్రమే సూర్యకాంతికి గురవ్వుతున్నారు. ఇలా సూర్యరశ్మికి ఎక్స్ ఫ్లోర్ కాని వారిలో డి విటమిన్ లోపం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ కాంతి మెదడులో రసాయన మార్పుకు కారణం అవుతుంది. అది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. స్వచ్ఛమైన సూర్యకాంతిలో ఉదయం, సాయంత్రం వేళల్లో నడవడం వల్ల మానసికంగా, శారీరకంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

1. సూర్యుడి నుండి వచ్చే కాంతి లేదా లైట్ థెరపీలో వాడే ప్రత్యేక బల్బుల నుంచి వచ్చే కాంతి… ఇది మానసిక స్థితిని సంతోషంగా మారుస్తుంది. ఇది శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి.

2. స్వచ్ఛమైన కాంతికి గురికావడం వల్ల మెదడు అలెర్ట్‌గా, చురుగ్గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని సిర్కాడియన్ రిథమ్ నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని వల్ల మంచి నిద్ర పడుతుంది.

ఈ రెండింటిలో ఏది బెస్ట్...! ఆరోగ్యానికి ఏది మంచిది..!


3. మెదడులో విడుదలయ్యే సెరోటోనిన్ మానసిక స్థితిని పెంచడంలో సహకరిస్తుంది. కాంతిని కళ్ళ ద్వారా స్వీకరించినప్పుడు అది సెరోటోనిన్ విడుదలకు సహాయపడుతుంది.

4. కాంతి శరీరంపై పడడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతుంది, ఎండార్ఫిన్లు సంతోషంగా ఉండటానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడతాయి.

మజ్జిగను తీసుకుంటే కడుపులో చల్లని ఫీలింగ్ కలుగుతుంది.. వేసవిలో ఇలా ట్రై చేయండి.

5. సూర్యరశ్మికి గురికావడం వల్ల విటమిన్ డి శరీరంలో అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఎముక ఆరోగ్యానికీ, ఇన్ ఫ్లమ్మేషన్ తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 08 , 2024 | 03:40 PM

Advertising
Advertising