ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Milk Benefits: పాలు ఏ సమయంలో తాగితే అధిక ప్రయోజనం ఉంటుంది? తప్పక తెలుసుకోండి..!

ABN, First Publish Date - 2024-02-05T22:38:52+05:30

Milk Benefits: పౌష్టికాహారాలలో పాలు చాలా కీలకం. అందుకే పాలు రోజూ తాగాలని సూచిస్తుంటారు ఆరోగ్య నిపుణులు. కానీ, చాలా మంది పాలు తాగే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. పాలు తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారు పాలు తాగడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

Benefits of Milk

Milk Benefits: పౌష్టికాహారాలలో పాలు చాలా కీలకం. అందుకే పాలు రోజూ తాగాలని సూచిస్తుంటారు ఆరోగ్య నిపుణులు. కానీ, చాలా మంది పాలు తాగే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. పాలు తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారు పాలు తాగడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. రోజూ పాలు తాగడం వల్ల కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్స్ వంటి అవసరమైన పోషకాలు శరీరానికి అందుతాయి. పాలు ఎముకల ఆరోగ్యానికి చాలా కీలకం. కండరాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే, పాలను కొందరు ఉదయం తాగుతారు.. మరికొందరు రాత్రి తాగుతారు.. మరి ఈ రెండు సమయాల్లో పాలు ఎప్పుడు తాగితే మేలు జరుగుతుంది. ఈ ప్రత్యేక స్టోరీలో తెలుసుకుందాం..

ప్రతి రోజు పాలు త్రాగడానికి ఉత్తమ సమయం ఏది?

రోజులో ఏ సమయంలోనైనా పాలు తాగవచ్చు. అయితే, పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వల్ల మెలటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. తద్వారా మంచి నిద్ర వస్తుంది.

ఉదయం పాలు తాగితే..

ఉదయం వేళ పాలు తాగడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అతి తినడాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అయితే, వ్యక్తిగత ప్రాధాన్యతలు, ఆహార అవసరాలను బట్టి షెడ్యూల్‌కు అనుగుణంగా పాలను డైట్‌లో ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

రోజులో ఎన్ని పాలు తాగాలి..

వయస్సు, ఆరోగ్య స్థితి, ఆహార అవసరాలకు అనుగుణంగా పాలు తాగొచ్చు. సాధారణంగా పెద్దలు రోజుకు 1 నుంచి మూడు సార్లు పాలు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అంటే.. 1-3 కప్పుల పాలు తీసుకోవాలి. ఇది రోజువారీ కేలరీలను మించకుండా కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ వంటి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

జీర్ణ సమస్యలుంటే ఏం చేయాలి..

కొంత మందికి పాలు జీర్ణం కావు. తద్వారా కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితిలో పాలకు బదులుగా.. బాదం, సోయా పాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. లేదంటే.. రోజులో పలుమార్లు కొద్ది కొద్దిగా పాలు తాగితే ప్రయోజనం ఉంటుంది.

పాలను ఆరోగ్యంగా, రుచికరంగా ఎలా తయారు చేయాలి..

పాలలో ఎక్కువగా చెక్కర వేయకుండా.. దాల్చిన చెక్క, యాలకులు వంటి సహజ పదార్థాలు కలపడం వల్ల రుచికరంగా ఉండటంతోపాటు.. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అలాగే పండ్లతో కలిపి స్మూతీ తయారు చేసుకోవచ్చు. పిప్పరమెంట్ వంటి హెర్బల్ టీ చేసుకుని తాగొచ్చు. ఇలా చేస్తే మంచి రుచితో పాటు.. ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

Updated Date - 2024-02-05T22:38:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising