Running : కీళ్లను బలహీనం చేసే రన్నింగ్ మిస్టేక్స్ ఇవే.. !
ABN, Publish Date - Apr 20 , 2024 | 03:04 PM
పరుగు పెట్టే సమయంలో కాళ్లు, పాదాల మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దీనికి సరైన పాదరక్షలను ఎంచుకోవడం కూడా ముఖ్యం. ఇవి పాదాల మీద ఒత్తిడి పడకుండా చేస్తాయి.
శరీరాన్ని బలంగా ఉంచేందుకు చేసే వ్యాయామంలో రన్నింగ్ ఒకటి. పరుగు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే కండరాలను బలోపేతం చేస్తుంది. కానీ రన్నింగ్ లో సాధారణంగా జరిగే తప్పిదాల కారణంగా చీలమండలో బెణుకు, ఒత్తిడి, మోకాలి గాయాలకు దారితీయవచ్చు. అలాగే ఇది కండరాల అసమతుల్యతకు, వెన్ను నొప్పికి కూడా కారణం అవుతుంది. చాలా మంది రన్నింగ్ సమయంలో తెలీకుండానే ఈ ఇబ్బందుల పాలవుతున్నారా? అవేమిటో చూద్దాం.
ఓవర్ స్ట్రైడింగ్..
స్ట్రెడ్ పొడవు కారణంగా మోకాళ్లలో కీళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది క్రమంగా పెరిగి ఆర్థరైటిస్, కీళ్ళ క్షీణతకు కారణం కావచ్చు. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి, నడుస్తున్నప్పుడు తక్కువ స్ట్రెడ్ ను అలవాటు చేసుకోవాలి. స్ట్రెడ్ అంటే కాళ్ల మధ్య దూరం, కాలు వేస్తున్న వేగం.
నొప్పిని పట్టించుకోకపోవడం..
రన్నింగ్ చేసేప్పుడు ఉన్న అసౌకర్యాన్ని, నొప్పులను పట్టించుకోకపోవడం, సమస్యను పెద్దది చేస్తుంది.
వార్మ్ అప్..
వార్మప్ వ్యాయామాలు చేయడంలో ఇబ్బంది కలిగితే అది నొప్పిని పెంచుతుంది. డైనమిక్ స్ట్రెచ్, మొబిలిటీ వ్యాయామాలు, ఫ్రీ రన్ వంటివి కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు తగ్గించాలి.
Healthy liver : కాలేయం ఆరోగ్యానికి ఏ ఆహారాలు తీసుకోవాలి..!
రన్నింగ్ టెక్నిక్..
1. పరుగు పెట్టే సమయంలో కాళ్లు, పాదాల మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దీనికి సరైన పాదరక్షలను ఎంచుకోవడం కూడా ముఖ్యం. పాదాల మీద ఒత్తిడి పడకుండా చేస్తాయి.
2. పరుగు పెడుతున్న నేల కూడా గతుకులు లేకుండా ఉన్నదైతే కీళ్ల మీద ఎక్కువ ఒత్తిడి ఉండదు.
3. వారంలో ఒకసారి టెంపో రన్ చేయడం ముఖ్యం. ఇది శరీరాన్ని వేగంగా కదిలే విధంగా చేస్తుంది.
4. మరీ పరిస్థితి ఇబ్బంది కరంగా మారితే.. ఫిజియోథెరపిస్ట్ లేదా రన్నింగ్ కోచ్ సలహాలను పాటించడం ముఖ్యం.
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.
Updated Date - Apr 20 , 2024 | 03:06 PM