ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Amazing Benefits : నువ్వుల్ని ప్రతిరోజూ తీసుకుంటే నోటి శుభ్రతను పెరుగుతుందా .. !

ABN, Publish Date - May 09 , 2024 | 04:36 PM

టైప్ 2 డయాబెటీస్ అనేది జీనవితకాల వ్యాధి, దీనిలో శరీరం ఇన్సులిన్ ని తయారు చేయడానికి అనుమతించదు. ఈ స్థితిని అధిక రక్త చక్కెర, హైపర్గ్లైసిమియా అంటారు. నువ్వులు తీసుకోవడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.

Amazing Benefits

భారతీయుల వంటకాల్లో నువ్వులు మనం తినే రోజు వారి ఆహారంలో ఎక్కడో అక్కడ నువ్వులు భాగమై ఉంటూనే ఉంటాయి. నువ్వులు ఆరోగ్యానికి మంచి చేస్తాయనే అవగాహన అందరిలోనూ ఉంటుంది. కనుకనే నువ్వు నూనెను వంటకాల్లో వాడేందుకు ఇష్టపడతారు. నువ్వులను మన ఆహారంలోనే కాకుండా సబ్బులు, సౌందర్య సాధనాల్లోనూ, మందులలోనూ మూలంగా చేసుకుంటున్నారు.

ఆరోగ్య ప్రయోజనాలు.. పూర్వకాలం నుంచి మన ఆహారంలో భాగమైన నువ్వులతో అనేక ప్రయోజనాలు శరీరానికి అందుతున్నాయి. నువ్వు గింజలలో లిగ్నాన్స్, ఫైటోస్టెరాల్స్ ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

నువ్వుల్లో అధికంగా ఫైటోస్టెరాల్ కంటెంట్ ఉంటుందని. 100 గ్రాములకు 400 నుంచి 413 మిల్లీ గ్రాముల వరకూ ఇది ఉంటుంది.

ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది..

నువ్వులలో సెసమిన్, సెసమోలిన్ యాంటీ ఆక్సిడెంట్,యాంటీ బాక్టీరియల్ లక్షణాలున్నాయి. యాంటీఆక్సిడెంట్లు కణాల నష్టాన్ని తగ్గిస్తాయి. ఇతర వ్యాధుల నుంచి రక్షిస్తాయి.


Hearth Health : గుండె నొప్పిని ముందుగానే తెలిపే లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

నువ్వులు యాంటీ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.

నోటి ఆరోగ్యానికి.. నువ్వులతో క్రమం తప్పకుండా నువ్వుల నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి, మధుమేహం ఉన్నవారు నువ్వుల నూనెను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

టైప్ 2 డయాబెటీస్ అనేది జీనవితకాల వ్యాధి, దీనిలో శరీరం ఇన్సులిన్ ని తయారు చేయడానికి అనుమతించదు. ఈ స్థితిని అధిక రక్త చక్కెర, హైపర్గ్లైసిమియా అంటారు. నువ్వులు తీసుకోవడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. నువ్వుల నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర పరిమాణాన్ని అదుపుచేస్తాయి.

Health Benefits : చింతపండుతో మధుమేహం ఉన్నవారికి ఎన్ని బెనిఫిట్స్ అంటే...!

క్యాన్సర్ నివారించేందుకు..

నువ్వులలోని సెసామాల్ ఈ లక్షణాలను కలిగి ఉంటుంది.యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మ్యుటాజెనిక్, యాంటీ హెపటోటాక్సిక్, మంటను తగ్గిస్తుంది, యాంటీ ఏజింగ్, కెమోప్రెవెంటివ్. నువ్వులు ప్రోటిన్ ఎక్కువగా కలిగి ఉంటాయి. శాకాహారం తినేవారికి మంచి ఆహారంగా ఉంటుంది.రాగితో నిండి ఉంటుంది కనుక ఇది రక్త కణాలను పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 09 , 2024 | 04:36 PM

Advertising
Advertising