ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

In Summer : ఈ తెరచాపలు కూలర్ కన్నా చల్లదనాన్ని ఇస్తాయి.. వేసవిలో వట్టివేరు ఉపయోగాలెన్నో... !!

ABN, Publish Date - Apr 04 , 2024 | 12:10 PM

వట్టివేరు చాపలు వేసవి కాలంలో గుమ్మానికి, కిటికీలకు వేలాడదీసి వాటిపై నీరు చల్లుతూ ఉంటే గదిలో మంచి సువాసనభరితమైన వాతావరణంతో చల్లగా ఉంటుంది. వట్టివేరు నుండి తీసిన నూనెతో మర్ధనా చేయడం వలన ఒంటి నొప్పులు తగ్గుతాయి.

Vetiver

వేసవిలో ఎండ వేడిని తట్టుకునేందుకు ఏసీలు, కూలర్ల మీద ఆధారపడుతూ ఉంటాం. అయితే ప్రకృతి సిద్ధంగా తయారయిన వట్టివేర్ల చాపలు ఇందుకు భిన్నంగా ఎలాంటి ఖర్చులేకుండా ఎండలలో వేడిని తట్టుకునే విధంగా చేస్తాయి. వట్టి వేరు శరీరాన్ని చల్లబరుస్తుంది. వేసవిలో వట్టవేరుతో చేసే డ్రింక్స్ నాడీ వ్యవస్థను సపోర్ట్ చేస్తాయి. ఒత్తిడి వంటి సమస్యలు దూరం అవుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

శరీరానికి ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం అనే సంగతి మనందరికీ తెలుసు. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్ నుంచి తప్పించుకునేందుకు ఎన్నో డ్రింక్స్‌ తాగుతూ ఉంటాం. కొన్ని ప్రత్యేకమైన పదార్థాలతో నీటిని మరిగించి వేసవిలో తాగడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి వాటిలో వట్టివేరు ఒకటి. ఆయుర్వేదం ప్రకారం వట్టివేరులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వేడిని తగ్గించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వట్టివేరుతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం.

వట్టివేరు చాపలు వేసవి కాలంలో గుమ్మానికి, కిటికీలకు వేలాడదీసి వాటిపై నీరు చల్లుతూ ఉంటే గదిలో మంచి సువాసనభరితమైన వాతావరణంతో చల్లగా ఉంటుంది. వట్టివేరు నుండి తీసిన నూనెతో మర్ధనా చేయడం వలన ఒంటి నొప్పులు తగ్గుతాయి. వట్టివేరు జ్యూస్‌ 10 రోజులు తాగితే మూత్ర సంబంధిత వ్యాధులు నయమవుతాయి.

1. వేసవిలో చెమటకాయలు దరిచేరనివ్వదు.

2. మొటిమలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది.

3. చెమట పట్టకుండా ఉండేందుకు సహాయపడుతుంది.

4. వట్టివేరు తురుము శరీరానికి రాసుకుంటే వేడి కురుపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.


ఇది కూడా చదవండి: వేసవిలో మట్టి కుండలో నీటిని ఎందుకు తాగాలి..! దీనితో కలిగే ప్రయోజనాలేంటి..!

5. ఒత్తిడి వంటి సమస్యలు దూరం అవుతాయి.

6. కోపం, అశాంతి, రక్తపోటు మొదలైన వాటిని నయం చేస్తుంది.

9. మెదడు, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.

10. వాంతులు, విరేచనాలు వంటి అనేక వ్యాధులకు ఇది మేలు చేస్తుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 04 , 2024 | 12:10 PM

Advertising
Advertising